Share News

Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

ABN , Publish Date - May 06 , 2024 | 02:39 PM

కాస్త పనిచేసినా అలసటగా అనిపించడం, ఏ పనీ చేయలేకపోడం కూడా గుండె పనితీరు సరిగా లేదని హెచ్చరించడమే. కొన్ని రోజుల పాటు అలసట, నీరసం స్త్రీలలో ఉంటూ ఉంటే ఇది వెంటనే గుండె జబ్బుకు సంకేతం.

Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
Hearth Health

ఇప్పటి రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. ప్రాణాలను చాలా వరకూ రిస్క్ లో పెడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నా కూడా గుండె పోటు వచ్చే ముందు మాత్రం మన శరీరంలో అనేక మార్పులు, సంకేతాలు కనిపిస్తాయి. అంతే కానీ సినిమాల్లో చూపినట్టుగా ఒక్కసారిగా నేలమీద పడిపోవడం ఒక్క కారణమే ఉండదు. ముందుగానే చాలా సంకేతాలు కనిపిస్తాయి. అయితే వాటిని పట్టించుకోక పోతే మాత్రం ప్రాణాపాయం తప్పదు. నిజానికి గుండె నొప్పిని ముందే తెలుసుకోవడం అనేది సాధ్యం కానిపనే.. కానీ అసలు గుండె నొప్పి రాబోయే ముందు మనలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి. తెలుసుకుందాం.

వయసు అరవైకి పైగా ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు, మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ సమస్యకు దగ్గరగా ఉన్నట్లే..

ఈ లక్షణాలు..

ఛాతిలో బరువుగా ఉంటుంది..

గుండె మొరాయిస్తుందని చెప్పే సాధారణ సంకేతం.. ఛాతిలో బరువుగా అనిపించడం. ఛాతిలో బిగుతు, నొప్పి ఉంటుంది.

వికారం, అజీర్ణం, గుండెల్లో మంట, కడుపునొప్పి..

కొందరిలో గుండెపోటు వచ్చే ముందు వాంతులు, వికారం, అజీర్ణం, గుండెల్లో మంట లక్షణాలు కనిపిస్తాయి.

Diabetes Tips : మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఏంటో తెలుసా.. !


చెయ్యి నొప్పి..

గుండెపోటు లక్షణాల్లో శరీరం ఎడమ వైపున పసరించే నొప్పి. ఛాతీలో మొదలయ్యి ఎడమ భాగంలో చేయి, కాలు లాగడం, నొప్పిగా ఉండటం ఉంటాయి.

తలతిరగడం..

తలతిరుగుతున్నట్టు, ముఖం ఇసురుతున్నట్టుగా అనిపించడం కూడా గుండెపోటుకు సంకేతాలే.. శరీరం బ్యాలెన్స్ కోల్పోయేలా చేయడం, స్వాధీనం తప్పడం, శ్వాసలో ఇబ్బంది, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సహాయం తీసుకోవడం మంచిది.

The Heat Wave : వేసవిలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ.. ఈ టైంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏవి?

గొంతు, దవడ నొప్పి ఉంటుంది.

అసలు ఇలాంటి లక్షణాన్ని వెంటనే గుండె నొప్పిగా అనుమానించలేం. కానీ ఇది గుండె నొప్పికి కలిగే సంకేతాల్లో ఒకటి. గొంతు, దవడ భాగాల్లో ఆ సమయంలో నొప్పి ఉండటం కూడా గుండె నొప్పి రాబోతుందనే సంకేతమే.

అలసట..

కాస్త పనిచేసినా అలసటగా అనిపించడం, ఏ పనీ చేయలేకపోడం కూడా గుండె పనితీరు సరిగా లేదని హెచ్చరించడమే. కొన్ని రోజుల పాటు అలసట, నీరసం స్త్రీలలో ఉంటూ ఉంటే ఇది వెంటనే గుండె జబ్బుకు సంకేతం.


Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!

గురక..

ఆదమరచి నిద్రపోతే గురక పెడతారు అనేది మనకు తెలిసిన విషయం. కానీ అది శరీరం అదమరిచినప్పుడు పెట్టే గురక కాదట. గురక ఎక్కువగా ఉంటే ఇది గుండె జబ్బు సమస్యకు సంకేతమే. ఈ పరిస్థితి గుండె పై అదనపు భారాన్ని పెంచుతుంది. రాత్రి నిద్ర సమయంలో ఎక్కువగా ఇలా అనిపిస్తే శ్వాస తీసుకోవడం ఆగిపోవచ్చు.

చెమటలు పట్టడం, ఆగకుండా దగ్గు, కాళ్ళు, పాదాలు, చీలమండలు ఉబ్బి ఉండటం కూడా గుండె జబ్బుకు ప్రధాన సంకేతాలే. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 06 , 2024 | 02:39 PM