ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: ముందు రాయ్‌బరేలీలో గెలవండి!

ABN, Publish Date - May 05 , 2024 | 04:29 AM

చెస్‌ అంటే తనకెంతో ఇష్టమని రాహుల్‌గాంధీ చెప్పిన ఓ వీడియోపై ప్రపంచ చెస్‌ మాజీ ఛాంపియన్‌ గ్యారీ క్యాస్పరోవ్‌.. ముందు రాయ్‌బరేలీలో గెలవండి అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

  • రాహుల్‌గాంధీ చెస్‌ వీడియోపై కాస్పరోవ్‌

  • జోక్‌గా అన్నానని చెప్పిన రష్యా చెస్‌ దిగ్గజం

న్యూఢిల్లీ, మే 4: చెస్‌ అంటే తనకెంతో ఇష్టమని రాహుల్‌గాంధీ చెప్పిన ఓ వీడియోపై ప్రపంచ చెస్‌ మాజీ ఛాంపియన్‌ గ్యారీ క్యాస్పరోవ్‌.. ముందు రాయ్‌బరేలీలో గెలవండి అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీనిపై క్యాస్పరోవ్‌ మళ్లీ స్పందిస్తూ.. అది జోక్‌ మాత్రమేనని, భారత రాజకీయాల మీద సాధికారిక వ్యాఖ్యగా తీసుకోవద్దని వివరణ ఇచ్చారు. తాను ఎంతో ప్రేమించే చదరంగంపై ఒక రాజకీయవేత్త (రాహుల్‌) స్పందించటం చూసి తాను ప్రతిస్పందించానే తప్ప మరేమీ కాదని స్పష్టం చేశారు.


ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్‌ మార్గమధ్యంలో తన మొబైల్‌లో చెస్‌ ఆడుతున్న వీడియోను ఇటీవల కాంగ్రెస్‌ ఎక్స్‌లో షేర్‌ చేసింది. దీన్ని కాంగ్రెస్‌ విమర్శకుడు, నటుడు రణ్‌వీర్‌ షోరీతోపాటు మరికొందరు కాస్పరోవ్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌లకు ట్యాగ్‌ చేశారు. దీనిపై క్యాస్పరోవ్‌ స్పందిస్తూ.. తొలుత రాయ్‌బరేలీలో గెలవండి అని వ్యాఖ్యానించారు. కాస్పరోవ్‌ వ్యాఖ్యపై మళ్లీ రణ్‌వీర్‌ షోరీ తదితరులు స్పందించటంతో క్యాస్పరోవ్‌ తాజాగా.. తన వ్యాఖ్యను జోక్‌లాగానే తీసుకోవాలని వివరణ ఇచ్చారు.

Updated Date - May 05 , 2024 | 04:29 AM

Advertising
Advertising