ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sunita Kejriwal: ఢిల్లీలో బిహార్ సీన్ రిపీట్.. కేజ్రీవాల్ సీఎం కుర్చీలో భార్య!

ABN, Publish Date - Mar 27 , 2024 | 04:07 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ తరచూ మీడియా ముందుకు రావడం, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం బిహార్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఢిల్లీలో రిపీట్ కావొచ్చని.. కేజ్రీవాల్ సీఎం కుర్చీని సునీత కైవసం చేసుకోవచ్చని కుండబద్దలు కొట్టారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal) తరచూ మీడియా ముందుకు రావడం, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం బిహార్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఢిల్లీలో రిపీట్ కావొచ్చని.. కేజ్రీవాల్ సీఎం కుర్చీని సునీత కైవసం చేసుకోవచ్చని కుండబద్దలు కొట్టారు. పశుగ్రాసం కుంభకోణంలో (Fodder Scam) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అరెస్ట్ అయినప్పుడు ఆయన భార్య రబ్రీ దేవి (Rabri Devi) మీడియా ముందుకొచ్చి ప్రకటనలు చేశారని.. క్రమంగా ఆమె సీఎం పీఠం ఎక్కారని గుర్తు చేశారు. ఇప్పుడు ఢిల్లీలోని పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. రబ్రీ దేవిలాగే సునీత కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

Delhi CM: లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు


అనురాగ్ ఠాకూర్ ఈ వాదన చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈడీ లాకప్ నుంచి తన భర్త కేజ్రీవాల్ పంపిన ఓ సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) లైవ్ స్ట్రీమ్ చేసిన ఈ వీడియోలో.. కేజ్రీవాల్ కూర్చునే కుర్చీపైనే సునీత కూర్చోవడాన్ని గమనించవచ్చు. వెనకాల అటు ఇటుగా త్రివర్ణ పతకాలతో పాటు భగత్ సింగ్ (Bhagat Singh), డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (BR Ambedkar) చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సునీత రాజకీయ ప్రవేశంపై పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. కేజ్రీవాల్ సీఎం కుర్చీని సునీత కైవసం చేసుకోవచ్చనయ్న అభిప్రాయాన్ని అనురాగ్ ఠాకూర్ వ్యక్తపరిచారు.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా స్పందన.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

ఇదే సమయంలో అనురాగ్ ఠాకూర్ ఆప్-కాంగ్రెస్ కూటమిపై (AAP - Congress Alliance) విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ ఎప్పుడూ నీతి గురించే మాట్లాడేవారని, కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు కూడా చేశారని, కానీ ఇప్పుడు ఆయనే అవినీతి కేసులో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. ఆప్ ఎంపీ, ఆరోగ్య మంత్రి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్సీ అందరూ జైల్లోనే ఉన్నారని.. ఇప్పుడు వాళ్ల సీఎం, లిక్కర్‌ స్కామ్‌లో కింగ్‌పిన్‌ అయిన కేజ్రీవాల్ కూడా జైలుపాలయ్యారని పేర్కొన్నారు. తాను జైలుపాలయ్యాక కూడా తన పదవికి రాజీనామా చేయలేదంటే.. సీఎం పదవి అంటే కేజ్రీవాల్‌కు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ నిజాయితీ లేని వ్యక్తి అని దుయ్యబట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 27 , 2024 | 04:12 PM

Advertising
Advertising