ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mukhtar Ansari: 'ఫాతిహా' సెర్మనీలో పొల్గొనేందుకు అన్సారీ కుమారుడికి సుప్రీం అనుమతి

ABN, Publish Date - Apr 09 , 2024 | 06:39 PM

జైలులో ఇటీవల మరణించిన ముక్తార్ అన్సారీ స్మారకార్ధం ఈనెల 10న జరుగనున్న 'ఫాతిహా' సెర్మనీలో పాల్గొనేందుకు ఆయన కుమారుడు అబ్బాస్ అన్సారీకి సుప్రీంకోర్టు మంగళవారంనాడు అనుమతి ఇచ్చింది. . అబ్బాస్ ప్రస్తుతం వివిధ క్రిమిషన్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.

న్యూఢిల్లీ: జైలులో ఇటీవల మరణించిన ముక్తార్ అన్సారీ (Mukthar Ansari) స్మారకార్ధం ఈనెల 10న జరుగనున్న 'ఫాతిహా' సెర్మనీలో పాల్గొనేందుకు ఆయన కుమారుడు అబ్బాస్ అన్సారీ (Abbas Ansari)కి సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారంనాడు అనుమతి ఇచ్చింది. అబ్బాస్ ప్రస్తుతం వివిధ క్రిమిషన్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.


'ఫాతిహా' రిట్యుయల్‌కు అబ్సాస్ అన్సారీని అనుమతించక పోవడానికి కారణం ఏమీ కనిపించడం లేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారంనాడు అభిప్రాయపడింది. శాంతి భద్రతల పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలకు ధర్మాసనం స్పందిస్తూ, అబ్సాస్ అన్సారీని కసంగి జైలు నుంచి తన స్వస్థలమైన ఘాజిపూర్‌కు తగినంత భద్రతతో పోలీసు కస్టడీలో తీసుకువెళ్లాలని ఆదేశించింది. శాంతియుతంగా, క్రమబద్ధమైన రీతిలో ఈ మొత్తం ప్రక్రియ జరగాలని రాష్ట్ర పోలీస్ చీఫ్‌‌కు ఆదేశాలిచ్చింది. అబ్బాస్ అన్సారీని తీసుకువెళ్లే ప్రక్రియ సాయంత్రం 5 గంటల తర్వాత కాకుండా ముందుగానే ప్రారంభించాలని సూచించింది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో తన కుటుంబ సభ్యులను అబ్బాస్ కలుసుకునేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. విజిటర్లను చెదరగొట్టడం కానీ, ఆయుధాలు తీసుకువెళ్లడం కానీ చేయొద్దని పోలీసు అధికారులను అదేశించింది. మీడియాతో అబ్బాస్ మాట్లాడరాదని, ఏప్రిల్ 13వ తేదీన తిరిగి కాస్‌గంజ్ జైలుకు ఆయనను తీసుకురావాలని కోర్టు స్పష్టం చేసింది.

Delhi Liquor Case: కేజ్రీవాల్ జైలులోనే...హైకోర్టులో దక్కని ఊరట


తన తండ్రి ఫాతిహా సెర్మనీకి అనుమతించాలని కోరుతూ అబ్బాస్ చేసిన విజ్ఞప్తిపై ఏప్రిల్ 5న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం స్పందన తెలియజేయాలని కోరింది. దీనికి ముందు, తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని హైకోర్టును అబ్బాస్ కోరారు. అయితే, సకాలంలో ఆయన పిటిషన్ లిస్టింగ్ కాకపోవడంతో ముక్తారీ అన్సారీ అంత్యక్రియలు అప్పటికే ముగిసిపోయాయి. పలు కేసుల్లో దోషిగా నిరూపణ కావడంతో జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ మార్చి 28న గుండెపోటుతో జైలులోనే మృతిచెందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 06:39 PM

Advertising
Advertising