ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhagwant Mann: కేజ్రీవాల్‌‌కు జైలులో ట్రీట్‌మెంట్ దారుణం.. పంజాబ్ సీఎం భావోద్వేగం

ABN, Publish Date - Apr 15 , 2024 | 03:38 PM

తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ ను కరడుగట్టిన క్రిమినల్స్ కంటే దారుణంగా చూస్తున్నారని, ఒక గ్లాస్‌ వాల్ గుండా ఫోనులో ఆయన తనతో మాట్లాడారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలిపారు.

న్యూఢిల్లీ: తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను కరడుగట్టిన క్రిమినల్స్ కంటే దారుణంగా చూస్తున్నారని, ఒక గ్లాస్‌ వాల్ గుండా ఫోనులో ఆయన తనతో మాట్లాడారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant singh Mann) తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను భగవంత్ మాన్ సోమవారంనాడు కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.


''గ్లాసు గోడ మరకలతో మసకమసకగా ఉంది. ఒకరి ముఖం మరొకరు చూసుకోవడం కూడా చాలా కష్టం. ఎలా ఉన్నారని ఆయనను అడిగాను. ఆయన తన గురించి చెప్పలేదు. పంజాబ్ గురించి అడిగారు. రైతులు ఏంచేస్తున్నారు? పంట కోతలు మొదలయ్యాయా? అని అడిగారు. ఆప్ మొహల్లా క్లినిక్‌ల గురించి విచారించారు. ప్రజలకు సకాలంలో ఉచిత కరెంట్ అందుతోందా అని అడిగారు. ఆయన ఆందోళన అంతా ప్రజల గురించే. ప్రజలకు పని చేయడం కోసం రాజకీయాలు ఉంటాయి కానీ రాజకీయాల కోసం రాజకీయాలు చేయం. మేము దేశభక్తులం. దేశం కోసమే మా పోరాటం'' అని భగవంత్ మాన్ చెప్పారు.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకే రోజు డబుల్ షాక్.. అసలేమైందంటే..


కేజ్రీవాల్ చేసిన నేరం ఏమిటి?

కరడుగట్టిన క్రిమినల్స్‌కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్‌కు ఇవ్వడం లేదని, ఆయన చేసిన నేరం ఏమిటని మాన్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇచ్చారని, మొహల్లా క్లినిక్‌లతో ఉచిత వైద్య చికిత్స అందజేశారని చెప్పారు. జైలు మాన్యువల్ ప్రకారం సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విజిటర్లతో ముఖాముఖీ మాట్లాడేందుకు అనుమతిస్తుంటారని చెప్పారు. చిదంబరం జైలులో ఉన్నప్పుడు ఆయనతో ముఖాముఖీ జరిపేందుకు సోనియాగాంధీని అనుమతించారని, ప్రకాష్ సింగ్ బాదల్‌ను సైతం ఒక రూములో ముఖాముఖీకి అనుమతించారని గుర్తుచేశారు. కేజ్రీవాల్ విషయంలో ఏతరహా శత్రుత్వం ఉందో తనకు అర్ధం కావడం లేదని మాన్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వెంట తాము బలంగా నిలబడతామని, జూన్ 4వ ఎన్నికల తేదీన వెలువడే ఫలితాలతో అతిపెద్ద రాజకీయ శక్తిగా ఆప్ అవతరించడం ఖాయమని మాన్ జోస్యం చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 03:38 PM

Advertising
Advertising