ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amith Shah: ఎలక్టోరల్ బాండ్ల విరాళాలను కాంగ్రెస్ తీసుకుంది.. అదీ దోపిడేనా: అమిత్ షా

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:43 PM

ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) పథకం అతి పెద్ద దోపిడీగా అభివర్ణించడాన్ని షా తప్పుబట్టారు.

ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) పథకం అతి పెద్ద దోపిడీగా అభివర్ణించడాన్ని షా తప్పుబట్టారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ..

"ప్రతిపక్ష పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని దోపిడీగా.. ప్రధాని మోదీని అవినీతికి ఛాంపియన్‌ అని అభివర్ణించాయి. ఆయా పార్టీలు కూడా బాండ్ల ద్వారా విరాళాలు పొందారు. ప్రతిపక్ష పార్టీలు చేసింది కూడా దోపిడేనా.. ఈ విషయంపై రాహుల్ క్లారిటీ ఇవ్వాలి.


మా ఎంపీల సంఖ్యకు అనుగుణంగా బీజేపీకి ఎక్కువగా విరాళాలు అందాయి. ప్రతిపక్షాల్లాగా అవినీతి చేసి డబ్బులు కూడబెట్టుకోలేదు" అని షా అన్నారు. పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నాయనే కారణంతో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని రాజకీయ పార్టీలు, దాతల మధ్య క్విడ్ ప్రోకోకు దారితీయవచ్చని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

Delhi: భారతీయులు అనవసర ప్రయాణాలు వద్దు.. దుబాయి ఎంబసీ హెచ్చరిక


సుప్రీం కోర్టు ఏమందంటే..

గడిచిన 5 ఏళ్లలో పలు రాజకీయ పార్టీలకు వెళ్లిన ఎలక్టోరల్ బాండ్ల విషయాలు బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఎస్బీఐను ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎస్బీఐ ఓ పెన్ డ్రైవ్‌లో బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కి సమర్పించింది. 2019 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేశామని అఫిడవిట్‌లో ఉంది. ఇందులో రాజకీయ పార్టీలు 22,030 బాండ్లను రీడీమ్ చేశాయి.

మిగిలిన 187 బాండ్లు రీడీమ్ చేసి, నిబంధనల ప్రకారం నగదును ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్లు బ్యాంక్ తెలిపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని కోర్టు పేర్కొంది. 2018లో ప్రవేశపెట్టిన ఈ పథకంలో బీజేపీ గరిష్టంగా నిధులు పొందింది. బీజేపీ అక్షరాలా రూ.6,986.5 కోట్లు విరాళాల రూపంలో అందుకుందని ఎస్బీఐ తన నివేదికలో వెల్లడించింది. ఆ తరువాత అత్యధికంగా టీఎంసీ రూ.1,397, కాంగ్రెస్ రూ.1,334 కోట్లు విరాళాల రూపంలో అందుకున్నాయి.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 04:43 PM

Advertising
Advertising