Miss World 2024: మిస్ వరల్డ్ 2024 కిరీటం గెల్చుకున్న క్రిస్టినా పిస్కోవా
ABN, Publish Date - Mar 10 , 2024 | 06:43 AM
ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటం గెలుచుకుంది. ఇక భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సిని శైట్టి ఏ ర్యాంకులో ఉందో ఇక్కడ చుద్దాం.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి(miss world 2024) టైటిల్‌ను గెలుచుకుంది. ముంబై(mumbai)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకుపైగా చెందిన ముద్దుగుమ్మలు ఈ పోటీలో పాల్గొనగా చివరగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా(Krystyna Pyszkova) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాది విజేత పోలాండ్‌కు చెందిన కరోలినా బియాలావ్‌స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేశారు. లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా సిని శెట్టి(sini shetty) ఈ అందాల పోటీల్లో మొదటి నాలుగు స్థానాల్లో కూడా నిలువలేకపోయింది. ఈ క్రమంలో 8వ స్థానం దక్కించుకుంది. పోటీ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడంలో సోషల్ మీడియా(social media) పాత్ర గురించి సినీని ప్రశ్నించాకం. ఆ క్రమంలో ఆమె స్పందన న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమై ఉండవచ్చని తెలుస్తోంది. కర్నాటకకు చెందిన సిని శెట్టి 2022లో ఫెమినీ మిస్ ఇండియా 2022 కిరీటాన్ని గెలుచుకుంది.
గతంలో ఇండియా(india) ఆరుసార్లు ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకుంది. రీటా ఫరియా (1966), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (1994), డయానా హేడెన్ (1997), యుక్తా ముఖీ (1999), ప్రియాంక చోప్రా జోనాస్ (2000), మానుషి చిల్లర్ (2017).
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Singer Sunitha Interview : చేతిలో ఫోన్ ఉన్నవారందరూ హీరోలే..
Updated Date - Mar 10 , 2024 | 06:43 AM