ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: ఈ ప్రపంచాన్ని వీడొచ్చు.. పూర్ణియాను మాత్రం కాదు: పప్పు యాదవ్ సంచలనం

ABN, Publish Date - Mar 28 , 2024 | 08:00 PM

పూర్ణియా సీటును వదులుకునే ప్రసక్తే లేదని పప్పు యాదవ్ అంటున్నారు. అవసరమైతే ఈ ప్రపంచాన్ని వీడేందుకు సిద్ధం. కానీ పూర్ణియాలోని ప్రజలకు ఎప్పటికీ దూరం అవనని తేల్చి చెప్పారు. పూర్ణియా లోక్ సభ స్థానాన్ని తాను వీడటం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టేనని ప్రకటించారు. ఇక్కడ బీజేపీని నిలువరించేందుకు గత 40 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

పాట్నా: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల ముఖ్య నేతలు బిజీగా ఉన్నారు. బీహార్‌లో (Bihar) కాంగ్రెస్ (Congress) కూటమి సీట్ల లెక్క కొలిక్కి రావడం లేదు. ఇటీవల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన పప్పు యాదవ్ (Pappu Yadav) పూర్ణియా సీటును ఆశిస్తున్నారు. అక్కడ కూటమి భాగస్వామ్య పార్టీ ఆర్జేడీ బీమా భారతిని బరిలో దింపారు. ఈ క్రమంలో పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పప్పు యాదవ్ ఏమన్నారంటే..?

పూర్ణియా సీటును వదులుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే ఈ ప్రపంచాన్ని వీడేందుకు సిద్ధం. కానీ పూర్ణియాలోని ప్రజలకు ఎప్పటికీ దూరం అవను. పూర్ణియా లోక్ సభ స్థానాన్ని తాను వీడటం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టే. ఇక్కడ బీజేపీని నిలువరించేందుకు గత 40 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరా. తన పోటీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయే. పూర్ణియా నుంచి పోటీ చేసి ఎప్పుడూ ఓడిపోలేదు. ప్రజలు తనను ఓడించలేదు.

నమ్మకంతో ఉన్నా..

‘రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై నమ్మకంతో ఉన్నా. లాలు ప్రసాద్ యాదవ్ మీద తనకు ఆపారం గౌరవం. గత ఏడాది ప్రణామ్ పూర్ణియా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. పూర్ణియా ప్రజలు తనను సొంత వ్యక్తిలా భావిస్తారు. వారు తనను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారు అని’ పప్పు యాదవ్ పేర్కొన్నారు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి లాలు ప్రసాద్ యాదవ్ 9 సీట్లు ఆఫర్ చేశారు. ప్రతీగా జార్ఖండ్‌లో రెండు సీట్లను అడిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 08:00 PM

Advertising
Advertising