ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: ఎన్నికల్లో పోటీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన నిర్మలా సీతారామన్

ABN, Publish Date - Mar 28 , 2024 | 03:50 PM

Lok Sabha Elections 2024: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) పోటీ చేసేందుకు తన వద్ద డబ్బుల్లేవని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) అన్నారు. గురువారం నాడు కేరళలో(Kerala) పర్యటించిన ఆమెను..

Nirmala Sitharaman

Lok Sabha Elections 2024: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) పోటీ చేసేందుకు తన వద్ద డబ్బుల్లేవని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) అన్నారు. గురువారం నాడు కేరళలో(Kerala) పర్యటించిన ఆమెను.. పలువురు విలేకరులు ఆమె పోటీ చేయడంపై ప్రశ్నించారు. దీనికి స్పందించిన నిర్మలా సీతారామన్.. డబ్బులు లేకపోవడం వల్లే పోటీ చేయడం లేదన్నారు. దీనికి ప్రతిస్పందించిన విలేకర్లు.. ఆర్థిక మంత్రి అయిన మీ వద్ద డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. అవి దేశానికి చెందిన నిధులు అని, తనవి కాదని నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు.

పోటీ చేయమన్నారు..

బీజేపీ అధ్యక్షుడడు జేపీ నడ్డా తనను ఆంధ్రా లేదా తమిళనాడు నుంచి పోటీ చేయమని ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయని, అందుకే పోటీ చేయడం లేదని తెలిపారు. తన అభ్యర్థనను బీజేపీ హైకమాండ్ అంగీకరించినందుకు నిర్మలా సీతారామన్ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట..

వేగంగా దేశాభివృద్ధి..

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వరుసగా మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు 8 శాతానికి మించిందన్నారు. మూడవ త్రైమాసికంలో 8.3 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. అనేక సమస్యలు, విపత్కర పరిస్థితుల్లోనూ 8 శాతానికి పైగా వృద్ధి నమోదవడం.. దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి సంకేతం అని పేర్కొన్నారు. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రతి రాష్ట్రం పాలుపంచుకోవాలని నిర్మలాసీతారామన్ కోరారు. పెట్టుబడిదారులు భారతదేశం వైపే చూస్తున్నారని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 03:50 PM

Advertising
Advertising