ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి: రాహుల్ గాంధీ

ABN, Publish Date - Feb 17 , 2024 | 05:26 PM

దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ధనికులు, పేదలు అనే భావన పోయి అందరూ సమానం అనే భావన వచ్చినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు అవుతుందని పేర్కొన్నారు.

దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ధనికులు, పేదలు అనే భావన పోయి అందరూ సమానం అనే భావన వచ్చినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజు గుడౌలియాలో సాగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఓపెన్ జీపుపై నిలబడి పర్యటించారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. ప్రేమతో కూడిన భారతదేశంలో ద్వేషానికి చోటు లేదన్నారు. ప్రజల మధ్య గొడవల వల్ల దేశం బలహీనమవుతుంది. దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

"నేను గంగమ్మకు నమస్కరించి ఈ యాత్రలో పాల్గొంటున్నాను. అందరూ తమ సోదరుడిని కలిసేందుకు వచ్చారు. దేశంలో రెండు భారతదేశాలు ఉన్నాయి. ధనవంతులకు ఒకటి. పేదలకు మరొకటి. దేశంలోని రైతులు, కార్మికుల సమస్యలను మీడియా చూపడం లేదు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండు సమస్యలు పీడిస్తున్నాయి" అని రాహుల్ గాంధీ ఈ పర్యటనలో అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలను ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.


భారత్ జోడో న్యాయ్ యాత్ర శుక్రవారం బిహార్ నుంచి చందువాలీ వద్ద ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించింది. రాయ్‌బరేలీలో జరిగే యాత్రలో తాను పాల్గొంటానని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. దేశానికి తూర్పు నుంచి పశ్చిమం వైపునకు సాగుతున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,700 కిలోమీటర్లు సాగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 05:26 PM

Advertising
Advertising