Chennai: చెన్నైకి పొంచివున్న ‘జల’గండం ?
ABN, Publish Date - Aug 04 , 2024 | 01:19 PM
రాజధాని నగరం చెన్నై(Chennai)కి జలగండం పొంచివుందా?.. నగరంలోని పలు ప్రధా న ప్రాంతాలు సముద్రంలో మునిగిపోవడం ఖాయమా?.. తూత్తుకుడి నగరానికీ ముప్పు తప్పదా?.. అవుననే అంటోంది బెంగళూరు(Bangalore)కు చెందిన ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ స్టడీస్’ సంస్థ.
- 2040 నాటికి హార్బర్, ఐల్యాండ్‌గ్రౌండ్, పల్లిక్కరణై ప్రాంతాలు నీట మునక
- 86.6 చదరపు కి.మీటర్ల భూభాగానికి ప్రమాదం
- 1987 నుంచి 2021 వరకు 0.679 సెం.మీ పెరిగిన సముద్రపు నీటిమట్టం
చెన్నై: రాజధాని నగరం చెన్నై(Chennai)కి జలగండం పొంచివుందా?.. నగరంలోని పలు ప్రధా న ప్రాంతాలు సముద్రంలో మునిగిపోవడం ఖాయమా?.. తూత్తుకుడి నగరానికీ ముప్పు తప్పదా?.. అవుననే అంటోంది బెంగళూరు(Bangalore)కు చెందిన ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ స్టడీస్’ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న భూతాపం, ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఆ సంస్థ చేసిన అధ్యయనం మేరకు 2040 నాటికి చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం తధ్యమని తేలింది.
ఇదికూడా చదవండి: BJP: 20 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల మార్పు?
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, భూతాపం తదితరాలపై అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ.. మన దేశంలోని తూర్పు, పశ్చిమతీర ప్రాంతాలకు చెందిన 15 నగరాలకు జలగండం వున్నట్లు ప్రకటించింది. ఇందులో ముంబై, చెన్నై, విశాఖపట్టణం(Mumbai, Chennai, Visakhapatnam) వంటి నగరాలుండడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న జనాభా కారణంగా పలు సముద్రతీర ప్రాంతాలు జనమయంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నెలకొన్న వివిధ పరిణామాల వల్ల సముద్రపు అడుగుభాగం క్రమేణా పెరుగుతోంది. దీనికి తోడు వాతావరణ మార్పుల కారణంగా సముద్రం నీటిమట్టం పెరిగి, తీరంలో ఉండే లోతట్టునగరాలను ముంచెత్తే అవకాశముంది.
ఇదికూడా చదవండి: ‘మీ పేరుతో డ్రగ్స్ పార్సిల్ దొరికిందంటూ.. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల్లా..
ఈ ప్రభావం చెన్నైపై కొంతమేర పడే అవకాశముంది. ఆ మేరకు 2040 నాటికి చెన్నైనగరంలో 7.29 శాతం భూభాగం నీటిలో మునిగిపోవచ్చని అంచనా. 7.29 శాతం అంటే 86.6 చదరపు కి.మీటర్ల భూభాగం సముద్రంలో మునిగిపోతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చెన్నై హార్బర్, అడయార్ పార్కు, ఐల్యాండ్ గ్రౌండ్, పల్లిక్కరణై ప్రాంతం నీట మునిగే అవకాశముంది. 2060 సంవత్సరంలో 9.65 శాతం (114.31 చ.కి.). 2080లో 15.11 శాతం (159.28 చ.కి.) 2100 సంవత్సరం నాటికి 16.9 శాతం (207.04 చ.కి) నీట మునిగిపోవచ్చని అంచనా. వాతావరణ పరిణామాల నేపథ్యంలో ఇది మరింత అధికమయ్యే అవకాశం కూడా వుంది.
కాగా 1987 నుంచి 2021 వరకు చెన్నైలో సముద్రమట్టం 0.679 సెం.మీటర్లు పెరిగిందని, ఏడాదికి ఒకసారి 0.066 సెం.మీటర్లు చొప్పున పెరుగుతోందని అధ్యయన నివేదికలో వెల్లడించింది. వాస్తవానికి ప్రస్తుతం అసెంబ్లీగా వున్న జార్జ్‌కోట ప్రహరీ వరకు సముద్ర తీరం వుండేది. బ్రిటీషు పాలనలో జాలర్లు జార్జ్‌కోట ప్రహరీ వరకు పడవలతో వచ్చి, చేపల్ని తీసుకువెళ్లే ఫొటోలే ఇందుకు సాక్ష్యం. అయితే తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా సముద్రపు నీరు వెనక్కి మళ్లిందని సీనియర్లు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నీరు ముందుకొస్తుందని, పలు ప్రాంతాలు మునిగిపోవడం తధ్యమని అధ్యయన నివేదిక హెచ్చరిస్తోంది.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Updated Date - Aug 04 , 2024 | 01:21 PM