ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Saurabh Bhardwaj: జైల్లో కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర!

ABN, Publish Date - Apr 20 , 2024 | 06:27 PM

జైల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మరణానికి చేరువ చేసే చర్యలు జరుగుతున్నాయని ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. తమ నాయకుడు కేజ్రీవాల్ టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఆయనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు జైలు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

Saurabh Bhardwaj

న్యూఢిల్లీ: జైల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మరణానికి చేరువ చేసే చర్యలు జరుగుతున్నాయని ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. తమ నాయకుడు కేజ్రీవాల్ టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఆయనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు జైలు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

శనివారం న్యూఢిల్లీలో సౌరభ్ మాట్లాడుతూ నెమ్మది నెమ్మది కేజ్రీవాల్ అవయవాలు దెబ్బ తీసి.. ఆయన్ని అంతమెందించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఆ క్రమంలో తీహార్ జైలు అధికారులు, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌లు దీని వెనుక ఉన్నారని చెప్పారు.

Yogi Adithyanath: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. మమతపై యోగి ఫైర్..


జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అందించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆశ్రయించింది. దీనిపై ఆదేశాలను న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఆ మరునాడే ఆ పార్టీ నాయకుడు, వైద్య శాఖ మంత్రి సౌరభ్ ఈ విధంగా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యంతో బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. ఆ క్రమంలో బంగాళదుంప, పూరి, పంచదార కలిపిన టీ, మామిడి కాయలు అరవింద్ కేజ్రీవాల్ తింటున్నారని న్యాయస్థానానికి ఈడీ విన్నవించింది.

Amit Shah : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే...


Elections 2024: 400 సీట్ల లక్ష్యం అంత ఈజీ కాదు.. ప్రధానిపై శరద్ పవార్ మండిపాటు..

అయితే ఈడీ వ్యాఖ్యలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ ఖండించారు. కేజ్రీవాల్ జైల్లో ఉండగా 48 సార్లు మాత్రమే ఆయన నివాసం నుంచి భోజనం వచ్చిందన్నారు. అందులో మూడు సార్లు మాత్రమే మామిడికాయలు తీసుకు వచ్చారని చెప్పారు.

తనపై ఈడీ చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవన్నారు. ఈడీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. తాను షుగర్ ప్రీ టీ తాగుతున్నట్లు చెప్పారు. అలాగే ఒకసారి అది పూజ జరిగిన సమయంలోనే మాత్రమే ఆల్ పూరి కూర తిన్నట్లు కేజ్రీవాల్ కోర్టుకు వివరించారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 20 , 2024 | 09:13 PM

Advertising
Advertising