ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Covid Update: దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు..డబుల్ అయిన మరణాలు

ABN, Publish Date - Jan 07 , 2024 | 10:56 AM

భారతదేశం(india)లో గత 24 గంటల్లో 756 కొత్త కోవిడ్ 19 కేసులు(covid 19 cases) నమోదయ్యాయి. దీంతోపాటు మరణాల సంఖ్య రెట్టింపు కావడంతో స్థానిక ప్రజలతోపాటు ఇతరుల్లో కూడా భయాందోళన మొదలైంది.

భారతదేశం(India)లో గత 24 గంటల్లో కొత్తగా 756 కోవిడ్ -19 కేసులు(covid 19 cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,049కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇదే క్రమంలో మరణాలు ఐదు రికార్డయ్యాయి. నిన్న రెండు మరణాలు నమోదు కాగా..ఈరోజు డబుల్ కావడం విశేషం. వీటిలో మహారాష్ట్ర, కేరళ నుంచి రెండు చొప్పున నమోదు కాగా..జమ్ము కాశ్మీర్ నుంచి ఒకటి నమోదైంది. ఈ నేపథ్యంలోనే 889 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

గత ఏడాది ఆగస్టు తర్వాత ముంబయి(mumbai) నగరంలో తొలిసారిగా నిన్న కరోనా మరణం నమోదైంది. చెంబూర్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించాడు. మరోవైపు నాగ్‌పూర్ నివాసి కూడా కరోనా కారణంగా మరణించాడు. JN.1 సబ్ వేరియంట్‌ కారణంగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

మరోవైపు దేశవ్యాప్తంగా మరణాలు(deaths) సంఖ్య కూడా క్రమంగా పెరగడం పట్ల ప్రజల్లో భయాందోళన మొదలైంది. అంతేకాదు చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వైరస్ మరింత విస్తరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.

Updated Date - Jan 07 , 2024 | 10:56 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising