ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Odisha: ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు: మరోవైపు ఎదురు కాల్పులు

ABN, Publish Date - Apr 25 , 2024 | 02:56 PM

భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్‌ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.

భువనేశ్వర్, ఏప్రిల్ 25: భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్‌ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.

TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి

మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. అందుకోసం లోంగిపోయిన మావోయిస్టుల సహకారం తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే ఈ కాల్పుల్లో ఒకరు గాయపడ్డారని చెప్పారు. ఈ ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో పేలుడు పదార్ధాలు, గ్రానెడ్ లాంచర్ లభించాయని.. వాటిని సీజ్ చేశామన్నారు.

EC: మోదీ, రాహుల్‌కు షాక్.. ఆ విషయంలో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు


మరోవైపు లోక్‌సభ ఎన్నికలతోపాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికల జరగుతున్నాయి. మే 13, 20, 25 తేదీతోపాటు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న బౌద్‌లో మే 20న ఎన్నికలు జరగనున్నాయి. గత నాలుగు నెలల్లో బౌద్ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు 7 చోటు చేసుకున్నాయని సౌమేంద్ర ప్రియదర్శి గుర్తు చేశారు.

AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం

ఒడిశాలో కలహండి, కందమాల్, మల్కాన్‌గిరి జిల్లాలు మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా పేరు పొందాయి. 2019 - 2023 మధ్య రాష్ట్రంలో 154 సార్లు మావోయిస్టులు విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. అలాగే 71 సార్లు ఎదురు కాల్పులు జరిగాయన్నారు. ఈ కాల్పుల్లో 42 మంది మరణించారన్నారు. 145 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. అలాగే 63 మంది మావోయిస్టులు లొంగిపోతే.. ఏడుగురు భద్రత సిబ్బంది ఈ ఎదురు కాల్పుల్లో మరణించారని సౌమేంద్ర తెలిపారు.

Read National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 02:56 PM

Advertising
Advertising