ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

God Hand: అంతరిక్షంలో ‘దేవుడి చెయ్యి’.. వైరల్ అవుతున్న ఫోటో

ABN, Publish Date - May 14 , 2024 | 04:53 PM

దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఎవరి నమ్మకం వారిది! ఏదో ఒక దైవశక్తి మనుషుల్ని నడిపిస్తోందని విశ్వసించేవారిని దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ఆకాశమే చిరునామా అంటారు. ఆకాశం నుంచి ఆ దేవుడు...

Dark Energy Camera Captures Gods Hand

దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఎవరి నమ్మకం వారిది! ఏదో ఒక దైవశక్తి మనుషుల్ని నడిపిస్తోందని విశ్వసించేవారిని దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ఆకాశమే చిరునామా అంటారు. ఆకాశం నుంచి ఆ దేవుడు మనల్ని అనునిత్యం గమనిస్తూనే ఉంటాడని నమ్ముతారు. అంతెందుకు.. అప్పుడప్పుడు ఆకాశంలో దైవాలుగా భావించే కొన్ని రూపాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా అలాంటిదే ఓ రూపం కెమెరాకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.


గాడ్స్ హ్యాండ్

అంతరిక్షంలో జరిగే అద్భుతాలను బంధించే డార్క్ ఎనర్జీ కెమెరా (DECam) లేటెస్ట్‌గా ఒక వండర్‌ఫుల్ ఫోటోని క్లిక్‌మనిపించింది. ఈ ఫోటోలోని ఆకారం చెయ్యి రూపంలో ఉండగా.. అది ‘స్పైరల్ గెలాక్సీ’ని (Spiral Galaxy) పట్టుకోవడానికి వెళ్తున్న భావన కలుగుతోంది. అందుకే.. ఈ ఫోటోకి ‘దేవుని చెయ్యి’ (Gods Hand) అనే పేరు పెట్టారు. నిజానికి.. ఈ చెయ్యి ఖగోళంలోని వాయు, ధూళి మేఘాలతో ఏర్పడింది. ఈ అరుదైన దృగ్విషయాన్ని చిలీలోని విక్టర్ ఎమ్. బ్లాంకో టెలిస్కోప్‌లో ఏర్పాటు చేసిన డార్క్ ఎనర్జీ కెమెరా బంధించింది. నిజానికి.. చెయ్యి ఆకారంలో ఉన్న ఆ దృశ్యాన్ని కొమెటరీ గోబుల్స్ (Cometary Globules) అని అంటారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భారత్‌కు అమెరికా వార్నింగ్.. ఆ ఒప్పందం కుదిరిన గంటల్లోనే..


1,300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘పప్పిస్’ (Puppis) కూటమిలోని పాలపుంత గెలాక్సీలో (Milky Way galaxy) ఈ ‘గాడ్స్ హ్యాండ్’ దృశ్యం కెమెరాకి చిక్కింది. ఈ చెయ్యి.. 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైరల్ గెలాక్సీ వైపు చేరుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆ చెయ్యి 1.5 కాంతి సంవత్సరాల పొడవు, దాని వెనుక తోక లాగా ఉన్న ఆకారం 8 కాంతి సంవత్సరాల పొడవు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఓ కాంతి సంవత్సరం అంటే ఎంతో తెలుసా? ఒక సంవత్సరం పొడవునా కాంతి ప్రయాణించే దూరం. ఇది 9.46 ట్రిలియన్ కిలోమీటర్లకు సమానం. అయితే.. దీనికి గాడ్స్ హ్యాండ్ అనే పేరు పెట్టినా, దీని వెనుక సూపర్‌నేచురల్ విషయమేమీ లేదు.

Read Latest International News and Telugu News

Updated Date - May 14 , 2024 | 04:53 PM

Advertising
Advertising