Hair-Care: ఎండాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా? ఇలా చేస్తే సరి..
ABN, Publish Date - May 16 , 2024 | 09:53 PM
ఎండాకాలంలో జుట్టు ఊడిపోయేవారు కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలంలో కొందరిలో జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అధికంగా చెమట, సీబమ్ ఉత్పత్తి కారణంగా ఈ పరిస్థితి వస్తుంది. ఎక్కువ సేపు ఎండలో ఉండటం కూడా జుట్టు ఊడిపోవడానికి ఓ కారణం. దీనికి తోడు గాలిలోని తేమ కారణంగా డాండ్రఫ్ పెరిగి జుట్టు కుదుళ్లు బలహీన పడతాయి. ఇలా సీజనల్ గా వచ్చే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వైద్యులు కొన్ని సూచనలు (Hair care in Summer) చేస్తున్నారు.
నీరు బాగా తాగాలి. దీంతో, కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
తలస్నానానికి మైల్డ్ షాంపూనే వాడాలి. దీంతో, చర్మంపై ఉండే సహచసిద్ధమైన నూనెలో పోకుండా ఉంటాయి.
హెయిల్ స్టైల్ కోసం అతిగా ప్రయత్నిస్తే జుట్టు బలహీన పడుతుంది. హెయిర్ డ్రయ్యర్‌ల వినియోగం కూడా తగ్గించాలి.
జుట్టుపై ఎండ ఎక్కువగా పడకుండా చూసుకోవాలి, ఎండలోని యూవీ కిరణాలు జుట్టుకు హాని చేస్తాయి.
Reheating Oil: మూకుడులో అదే నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా? డేంజర్‌లో పడ్డట్టే..!
సమతుల ఆహారం తీసుకోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి కీలకం. విటమిన్ ఈ, బయోటిన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మేలు చేస్తాయి.
జుట్టు మొదళ్లకు బలం చేకూర్చే హెయిర్ మాస్క్స్ వాడాలి. ఆలోవీరా, కొబ్బరినీళ్లు, యోగర్ట్ తో చేసి మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
ఒత్తిడితో కూడా జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వీలైనంత వరకూ భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోవాలి.
నెత్తిపై చర్మం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
దువ్వెన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 16 , 2024 | 09:53 PM