ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coffee: కాఫీ వల్ల ఇన్ని లాభాలా.. తెలిస్తే వదిలిపెట్టరు

ABN, Publish Date - Jul 31 , 2024 | 02:34 PM

కాఫీ తాగడంపై చాలా మందికి పలు రకాల అనుమానాలు ఉంటాయి. ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల అనేక అవాంఛనీయమైన వైద్య రుగ్మతలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. సైడ్ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కాఫీ తాగితే పలు లాభాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్యులు.

ఇంటర్నెట్ డెస్క్: కాఫీ తాగడంపై చాలా మందికి పలు రకాల అనుమానాలు ఉంటాయి. ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల అనేక అవాంఛనీయమైన వైద్య రుగ్మతలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. సైడ్ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కాఫీ తాగితే పలు లాభాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్యులు. ఉదయం లేవగానే కాఫీ తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుందట.


కాఫీ(Coffee Benifits) తాగడం వల్ల అనేక రకాల కాలేయ వ్యాధులు నయమవుతాయి. పరిమితంగా బ్లాక్ కాఫీ తీసుకుంటే అది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను నయం చేయడంలో కాఫీ సహాయపడుతుందని తేలింది. గుండె, నాడీ, మధుమేహం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే రోజులో ఎంత కాఫీ తాగాలో తెలిసి ఉండటం ముఖ్యం.


రోజులో ఎంతంటే..

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగవచ్చు. బ్లాక్ కాఫీ కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అయితే కాఫీ పరిమాణం మీ ఆరోగ్యం, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

కాలేయానికి ఎంత మేలు..

కాఫీ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ 2 కప్పుల కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధులు తగ్గుతాయి. బ్లాక్ కాఫీ ముఖ్యంగా లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాఫీ తాగడం వల్ల దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ముప్పు 71 శాతం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇతర ప్రయోజనాలు

కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. డిప్రెషన్ తగ్గుతుంది. కాఫీ మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీని వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.


దుష్ప్రభావాలు..

అయితే కాఫీ తాగితే పలు దుష్ప్రభవాలు కూడా ఉన్నాయి. మొటిమలు రావడానికి కాఫీ ఓ కారణమని వైద్యులు అంటున్నారు. కాఫీ నేరుగా చర్మంపై మొటిమలను సృష్టించదు. కానీ, తీసుకునే ఆహారం, కాఫీలోని కెఫెన్ కలగలిపి మొటిమలను పెంచుతాయట.

కాఫీ తాగడం వల్ల మొటిమలు పెరుగుతాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే కెఫీన్ కలిగిన కాఫీలోని పదార్థాలైన పాలు, చక్కెర, మొటిమలకు కారణాలు కావచ్చు. ఈ రెండు, చర్మ పగుళ్లకు దారితీస్తాయి. కాఫీలో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కెఫీన్ శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. మొటిమలు ఒత్తిడి వల్ల వస్తాయి.

For Latest News and National News click here

Updated Date - Jul 31 , 2024 | 02:35 PM

Advertising
Advertising
<