ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: వ్యాధులు నయం చేస్తామని మోసం.. ఆయుర్వేద ఔషధాల ముఠా అరెస్ట్‌

ABN, Publish Date - Apr 17 , 2024 | 01:07 PM

వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి నయం చేస్తామని మోసాలకు పాల్పడుతున్న కర్ణాటక, నాగ్‌పూర్‌(Karnataka, Nagpur)కు చెందిన నకిలీ ఆయుర్వేద ఔషధాల ముఠా సభ్యులు ముగ్గురిని మధురానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్: వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి నయం చేస్తామని మోసాలకు పాల్పడుతున్న కర్ణాటక, నాగ్‌పూర్‌(Karnataka, Nagpur)కు చెందిన నకిలీ ఆయుర్వేద ఔషధాల ముఠా సభ్యులు ముగ్గురిని మధురానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీలు వెంకటరమణ, మోహన్‌కుమార్‌(Venkataramana, Mohankumar) వివరాలు వెల్లడించారు. క్యాన్సర్‌, పక్షవాతం, చర్మవ్యాధులు, కిడ్నీ, అల్జీమర్‌, న్యూరో, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారిని ముఠా సభ్యులు గుర్తించేవారు. తమ ఇంట్లో సభ్యులకు కూడా ఈ తరహా సమస్య ఉండేదని, ఆయుర్వేద ఔషధం వాడితే తగ్గిపోయిందని నమ్మించేవారు.

ఇదికూడా చదవండి: Hyderabad: చోరీ చేసిన వాహనాలతో విన్యాసాలు.. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు

మందు కోసం తమకు తెలిసిన వైద్యుడిని సంప్రదించాలని ముఠాలో మరో సభ్యుడి ఫోన్‌ నంబర్‌ ఇస్తారు. తరువాత వైద్యులుగా చెప్పుకునే ముఠా సభ్యులు బాధితుల ఇళ్లకు వెళ్లి కొబ్బరి, ఆవ నూనె, కర్పూరం, యాలకులు, పసుపుతో చికిత్స మార్గాలను సూచిస్తారు. చికిత్సకు వాడే వస్తువులు తమకు తెలిసిన ఆయుర్వేద స్టోర్లలో మాత్రమే దొరుకుతాయని చెబుతారు. బాధితులకు నకిలీ ఆయుర్వేద మందుల దుకాణాల వివరాలు చెబుతారు. ఇంటికి వచ్చి చికిత్స చేసేందుకు, ఆయుర్వేద దుకాణాల్లో మందులు కొనుగోలు చేసేందుకు లక్షల్లో డబ్బు వసూలు చేస్తారు. నిందితులు నగరంలో 14 మోసాలకు పాల్పడ్డారు. బాధితుల నుంచి రూ. 19 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

ఇదికూడా చదవండి: Hyderabad: అయ్యోదేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

Updated Date - Apr 17 , 2024 | 01:07 PM

Advertising
Advertising