ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Market: ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు!

ABN, Publish Date - Apr 15 , 2024 | 04:39 PM

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయ సూచీలపై భారీ ప్రభావం చూపించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడికి దిగిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతికార దాడులకు దిగొచ్చన వార్తల నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయ సూచీలపై భారీ ప్రభావం చూపించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడికి దిగిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతికార దాడులకు దిగొచ్చన వార్తల నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి (Stock Market). ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేదు. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల విలువలో రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది (Business News).


సోమవారం ఉదయం 900 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నానానికి కోలుకుంటున్నట్టే కనిపించింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాలు మొదలు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చివరకు 845 పాయింట్ల నష్టంతో 73,399 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా భారీ నష్టంతో రోజును ముగించింది. ఏకంగా 246.90 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 791 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 786 పాయింట్లు నష్టపోయింది.


సెన్సెక్స్‌లో ప్రధానంగా ఓఎన్‌జీసీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, హిందోల్కా, గుజరాత్ గ్యాస్ లాభాలను ఆర్జించాయి. ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్సియల్స్, అతుల్, టాటా కెమికల్స్, కోఫోర్జ్ లిమిటెడ్ నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.45గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి


Tesla Deal: టెస్లా కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్.. ఒప్పందం కుదిరినట్లు..


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 04:39 PM

Advertising
Advertising