ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

ABN, Publish Date - Apr 26 , 2024 | 04:08 PM

వరుస లాభాలతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు వారంలో చివరి రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా ఐదో రోజులను లాభాలను అందుకున్న మార్కెట్లు నష్టాలతో ఈ వారాన్ని ముగించాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ సూచీలు నష్టాలను కళ్ల జూశాయి.

Stock Market

వరుస లాభాలతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు వారంలో చివరి రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా ఐదో రోజులను లాభాలను అందుకున్న మార్కెట్లు నష్టాలతో ఈ వారాన్ని ముగించాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ సూచీలు నష్టాలను కళ్ల జూశాయి. ఈ రోజు ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అనిశ్చితిలోనే కదలాడాయి. మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి (Business News).


శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 73,616 వద్ద ఇంట్రాడే లోని తాకింది. ఆ తర్వాత కోలుకుని లాభాల్లోకి ప్రవేశించి 74,515 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు 609 పాయింట్ల నష్టంతో 73,730 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు కోల్పోయి 22,4190 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 293 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 395 పాయింట్లు ఎగబాకింది.


సెన్సెక్స్‌లో ప్రధానంగా టెక్ మహీంద్రా, జీఎమ్ఆర్ ఎయిర్‌పోర్ట్స్, కోరమాండల్, కంటైనర్ కార్పొరేషన్ లాభాలను ఆర్జించాయి. ఎల్ అండ్ టీ టెక్నాలజీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సెర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Freshers Hiring: ఫ్రెషర్లకు శుభవార్త.. ప్రముఖ టెక్ కంపెనీలో 6 వేల కొలువులు


ICICI Bank: 17 వేల క్రెడిట్ కార్డులు బ్లాక్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్.. డేటా దుర్వినియోగంపై క్లారిటీ!


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 26 , 2024 | 04:08 PM

Advertising
Advertising