Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 145 పాయింట్లు ప్లస్..!
ABN, Publish Date - Jul 15 , 2024 | 03:52 PM
బడ్జెట్‌కు ముందు దేశీయ సూచీలు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. బడ్జెట్‌లో వివిధ రంగాలకు పెద్ద పీట వేయనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సూచీలు లాభాల జోరు చూపిస్తున్నాయి. ఈ వారాన్ని దేశీయ సూచీలు సానుకూలంగా ప్రారంభించాయి.
బడ్జెట్‌కు ముందు దేశీయ సూచీలు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. బడ్జెట్‌లో వివిధ రంగాలకు పెద్ద పీట వేయనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సూచీలు లాభాల జోరు చూపిస్తున్నాయి. ఈ వారాన్ని దేశీయ సూచీలు సానుకూలంగా ప్రారంభించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతోనే రోజును ముగించాయి (Business News).
శుక్రవారం ముగింపు (80, 519)తో పోల్చుకుంటే దాదాపు 150 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 350 పాయింట్లు లాభపడి 80, 862 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. ఆ తర్వాత మెల్లిగా దిగివచ్చింది. చివరకు 145 పాయింట్ల లాభంతో80, 664 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. 24, 635 వద్ద లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది. చివరకు 84 పాయింట్ల లాభపడి 24, 586 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ఓఎన్‌జీసీ, అబాట్ ఇండియా, అపోలో టైర్స్, గెయిల్ షేర్లు లాభపడ్డాయి. కమిన్స్, ఆస్ట్రాల్, ఆసియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 490 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 177 పాయింట్లు ఆర్జించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.59గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Deepinder Goyal: బిలియనీర్ల జాబితాలోకి జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్
SBI Interest Rates: ఎస్‌బీఐ అనూహ్య నిర్ణయం.. పెరగనున్న ఈఎంఐలు!
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 15 , 2024 | 03:53 PM