ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pan Aadhaar: పాన్ ఆధార్ లింక్ చేయలేదా.. వెంటనే చేయండి, లేదంటే ఫైన్!

ABN, Publish Date - Mar 28 , 2024 | 11:53 AM

మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే మార్చి 31 వరకు మాత్రమే ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేసుకోవాలంటే మాత్రం మీరు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డుతో లింక్(pan aadhaar link) చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే మార్చి 31 వరకు మాత్రమే ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేసుకోవాలంటే మాత్రం మీరు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు ఈ రెండు గుర్తింపు కార్డులను మార్చి 31లోపు లింక్ చేయకుంటే, మీ పాన్ కార్డ్ చెల్లుబాటు కాదని గుర్తుంచుకోండి. అయితే మీ స్మార్ట్‌ఫోన్ నుంచే పాన్ ఆధార్‌ను క్షణాల్లో లింక్(link) చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.


పాన్-ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలంటే

  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో https://www.incometax.gov.in/iec/foportal/కి వెళ్లండి

  • తర్వాత ఎడమవైపున ఉన్న "లింక్ ఆధార్ స్టేటస్"పై క్లిక్ చేయండి

  • అప్పుడు మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి కింద ఉన్న లింక్ ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

  • ఆ క్రమంలో మీరు ఆధార్, పాన్ ఇదివరకే లింక్ చేసినట్లైతే మీరు చేశారని వస్తుంది

  • ఒక వేళ లింక్ చేయకపోతే స్క్రీన్‌పై పాప్ అప్ మెను పాన్ ఆధార్‌తో లింక్ చేయబడలేదని చూపిస్తుంది

  • అప్పుడు మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడానికి "లింక్ ఆధార్" లింక్‌పై క్లిక్ చేయండి" అని చూపిస్తుంది

  • ఆ తర్వాత మీరు మీ ఆధార్ పాన్‌తో లింక్ చేశారని సందేశం వస్తుంది

ప్రస్తుతం పాన్-ఆధార లింక్ చేస్తున్నప్పుడు సర్వర్‌లో సమస్య వస్తుందని పలువురు అంటున్నారు. అయితే ఎక్కువ మంది ఆధార్-పాన్‌ను లింక్ చేయడానికి పోర్టల్‌ను యాక్సెస్ చేయడం వల్ల అలా వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఉదయం లేదా రాత్రి వేళల్లో సులభంగా చేసుకోవచ్చని వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 శాతం మంది పాన్ కార్డు వినియోగదారులు ఇంకా ఆధార్‌తో లింక్ చేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Banking: వచ్చే ఆదివారం బ్యాంకులు పని చేస్తాయి.. ఎలాంటి సేవలు అందిస్తారంటే..?

Updated Date - Mar 28 , 2024 | 12:37 PM

Advertising
Advertising