Viral News: ఫేక్ ట్రేడింగ్ యాప్‌తో రూ. 91 లక్షల నష్టం.. నితిన్ కామత్ అలర్ట్
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:13 PM
రోజురోజుకు సైబర్ మోసాలు క్రమంగా పంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఫేక్ ట్రేడింగ్ యాప్ కారణంగా ఏకంగా రూ. 91 లక్షలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆన్‌లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ ప్రస్తావించి కీలక విషయాన్ని తెలిపాడు.
దేశంలో సైబర్ మోసాలు (cyber crime) క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ ట్రేడింగ్ యాప్ కారణంగా ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్లో ఏకంగా రూ. 91 లక్షలు కోల్పోయాడు. దీంతో దేశంలో పెరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆన్‌లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ ప్రజలకు సూచించారు. స్టాక్ మార్కెట్ కుంభకోణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ క్రమంలో బెంగళూరు వ్యక్తి రూ. 91 లక్షలు పోగొట్టుకున్న వార్తను పంచుకుంటూ కామత్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు.
వచ్చే రోజుల్లో
అంతేకాదు గత 9 నెలల్లో దేశంలో రూ. 11,000 కోట్లకు పైగా స్కామ్‌లు జరిగాయని ప్రస్తావించారు. దేశంలో ఇలాంటి మోసాల ధోరణి వేగంగా పెరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మోసగాళ్లు ఉపయోగిస్తున్నందున రాబోయే కాలంలో ఇది మరింత పెరగవచ్చని భావించారు. ఇలాంటి నేపథ్యంలో మోసగాళ్లను కట్టడి చేసేందుకు ప్రజలు టెలిగ్రామ్, వాట్సాప్‌లో సెక్యూరిటీ సెట్టింగ్‌లను మార్చుకోవాలని సూచించారు. తద్వారా తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఏ గ్రూప్‌కి అనుమతించలేరని స్పష్టం చేశారు.
మొదటి 9 నెలల్లో రూ.11,333 కోట్ల మోసం
హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఇటీవలి నివేదిక ప్రకారం 2024 మొదటి 9 నెలల్లో (జనవరి నుంచి సెప్టెంబర్ వరకు) సైబర్ మోసం కారణంగా భారతీయులు రూ. 11,333 కోట్లు కోల్పోయారు. ఈ నివేదిక ప్రకారం వీటిలో గరిష్టంగా 4,636 కోట్ల రూపాయల నష్టం స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో జరిగింది. దీని తర్వాత పెట్టుబడికి సంబంధించిన మోసంలో రూ. 3,216 కోట్ల వరకు చోటుచేసుకుంది.
పెరిగిన డిజిటల్ అరెస్ట్ మోసాలు
ఈ స్కామ్‌ల వల్ల భారతదేశం అంతటా వందలాది మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. అంతేకాదు ఢిల్లీ నివాసి ఇటీవల ఓ స్కాంలో రూ. 1.15 కోట్లు కోల్పోయాడు. ఏప్రిల్‌లో బెంగళూరులోని జయనగర్ పరిసర ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త మోసపూరిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రూ. 5.2 కోట్లను పోగొట్టుకున్నాడు.
ఏదో ఒక ప్రాంతంలో
నివేదికల ప్రకారం మార్చిలో జరిగిన మరో సంఘటనలో పూణె మహిళ తన ఆభరణాలను విక్రయించిన తర్వాత రూ.24.12 లక్షలు పోగొట్టుకుంది. ఇలా ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో ఇటీవల "డిజిటల్ అరెస్ట్" మోసాల కారణంగా రూ.1,616 కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్థిక మోసం ఫిర్యాదులను హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 30 , 2024 | 12:49 PM