Anitha: గీతాంజలిని హత్య చేసింది వైసీపీనే: వంగలపూడి అనిత
ABN, Publish Date - Mar 14 , 2024 | 01:45 PM
అమరావతి: రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న గుంటూరు జిల్లా, తెనాలి వాసి గొల్తి గీతాంజలిని వైసీపీనే హత్య చేసిందని, ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.
అమరావతి: రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న గుంటూరు జిల్లా, తెనాలి వాసి గొల్తి గీతాంజలిని (Gitanjali) వైసీపీ (YCP)నే హత్య చేసిందని, ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి (CM jagan) శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ శవాలతో రాజకీయాలు చేయడం సీఎం జగన్ రెడ్డికి అలవాటేనని.. గతంలోనూ బాబాయ్ హత్య (Viveka Murder), కోతి కత్తి (Kodi Katti) డ్రామాలు రక్తి కట్టించారని అన్నారు. గీతాంజలి మృతి సమయంలో ఆమె వెంట ఉన్న ఇద్దరి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. గీతాంజలిని గుర్తించని శవంగా రెండు రోజులు ఆస్పత్రిలోనే ఎందుకు ఉంచారని నిలదీశారు. టీడీపీ సోషల్ మీడియా (TDP Soaial Media) ప్రచారం వల్లే గీతాంజలి చనిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గీతాంజలి భర్తతో వైసీపీ వాళ్లే ఫిర్యాదు చేయించింది వాస్తవం కాదా?.. ఎనిమిదేళ్ల గీతాంజలి కొడుక్కి 5 ఏళ్లుగా అమ్మఒడి ఎలా వస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆడబిడ్డలే జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తారని వంగలపూడి అనిత అన్నారు.
కాగా గీతాంజలి ఆత్మహత్య కేసులో కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు (Pasumarthy Rambabu)ను పోలీసులు అదుపులోకి తీసుకొని తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. రాంబాబును ఎందుకు అరెస్టు చేశారని, ఎక్కడకు తీసుకువెళుతున్నారని కుటుంబ సభ్యులు అడిగిన పోలీసులు సమాచారం ఇవ్వలేదు.
Updated Date - Mar 14 , 2024 | 01:45 PM