ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమల శ్రీవారి హుండిలో చోరీ

ABN, Publish Date - Nov 25 , 2024 | 10:10 PM

తిరుమల శ్రీవారి హుండీలోని నగదును ఓ యువకుడు దొంగలించాడు. ఈ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తిరుమల, నవంబర్ 25: తిరుమలలో కొలువు తీరిన ఆ ఏడుకొండల వాడి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ శ్రీవారి ఆలయంలోని హుండీలోని నగదును ఓ యువకుడు దొంగిలించాడు. నవంబర్ 23వ తేది మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీవారి ఆలయంలోని స్టీల్ హుండీలో నగదును ఓ దుండగుడు దొంగలించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో కొంత నగదు తస్కరించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన వ్యవహారమంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది పరిశీలించి.. యువకుడిని గుర్తించారు.

Also Read: కొడాలి నాని, వల్లభనేని వంశీ వికెట్ అవుట్.. అరెస్టుకు రంగం సిద్ధం?


Also Read: దక్షిణ, కోస్తా జిల్లాలో భారీ వర్ష సూచనలు

అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అదే రోజు సాయంత్రం 6.00 గంటలకు దొంగతనం చేసిన యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించారు. విచారణ చేపట్టారు. ఆ క్రమంలో చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ. 15 వేల నగదును భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీకి పాల్పడిన యువకుడి పేరు వేణు లింగమని తెలిపారు. అతడి స్వస్థలం తమిళనాడులోని శంకరన్ కోవిల్ అని వివరించారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For AndhraPradesh News And Telugu news

Updated Date - Nov 25 , 2024 | 10:11 PM