కొడాలి నాని, వల్లభనేని వంశీ వికెట్ అవుట్.. అరెస్టుకు రంగం సిద్ధం?

ABN, Publish Date - Nov 25 , 2024 | 09:40 PM

వైసీపీ ప్రభుత్వంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలో చేసిన అక్రమాలకు వారికి ఉచ్చు బిగుస్తున్నాయి. మట్టి కుంభకోణం, గ్రామీణ ఉపాధి పథకం పనుల్లో వారిద్దరు అడ్డంగా దొరికిపోయారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రభుత్వం సేకరించింది. దీంతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం.. స్థలాలను మెరక చేసేందుకు నిర్ణయించారు.

అందులోభాగంగా.. రూ. 40 కోట్లు నగదు విడుదల చేశారు. కానీ ఈ పనులకు కేవలం రూ. 6 నుంచి రూ. 7 కోట్ల మేర నిధులు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే వల్లభనేని వంశీకి సంబంధించిన పనులు సైతం కొనసాగాయి. ఇంకా చెప్పాలంటే.. గత ప్రభుత్వ హయాంలో వీరిద్దరు అడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated at - Nov 25 , 2024 | 09:40 PM