Supreme Court Justice : శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN, Publish Date - Dec 25 , 2024 | 05:14 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్ దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్, సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విజయ్‌కుమార్, భారత్ బయోటెక్ జేఎండీ, బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
Updated Date - Dec 25 , 2024 | 05:14 AM