Prominent Personalities : వెంకన్న సేవలో ప్రముఖులు
ABN, Publish Date - Dec 30 , 2024 | 04:56 AM
తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసశెట్టి, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ విజయభారతి, రాష్ట్ర హైకోర్టు రిజిస్ర్టార్ అడ్మిన్ వీఎ్‌సఎస్ శ్రీనివాసశర్మ కూడా తిరుమలేశుని దర్శించుకున్నారు.
Updated Date - Dec 30 , 2024 | 04:56 AM