ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Venigandla Ramu: ఆ విషయంలో వైసీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు

ABN, Publish Date - Feb 24 , 2024 | 06:46 PM

గుడివాడలో టీడీపీ విజయం చాలా స్పష్టంగా కనిపిస్తుందని గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము(Venigandla Ramu) అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. రామును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో గుడివాడలో టీడీపీ- జనసేన పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

కృష్ణాజిల్లా (గుడివాడ): గుడివాడలో టీడీపీ విజయం చాలా స్పష్టంగా కనిపిస్తుందని గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము(Venigandla Ramu) అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. రామును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో గుడివాడలో టీడీపీ- జనసేన పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ... ప్రత్యేక పరిస్థితులు ఉన్న గుడివాడ అభ్యర్థిగా తనను ముందే ప్రకటించడం సంతోషకరంగా ఉందని అన్నారు.

టీడీపీ - జనసేన, ప్రజాస్వామ్యవాదులందరి కృషితో గుడివాడను తిరిగి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. గుడివాడలో బ్రహ్మాండమైన విజయం సాధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇస్తానని చెప్పారు. దుర్మార్గుడికి గుణపాఠం చెప్పడానికి క్యాడర్ మొత్తం ఏకతాటి పైకి వచ్చిందని తెలిపారు. ఎన్నికలయ్యే వరకు అధికార వైసీపీకు అనువంత అవకాశం కూడా ఇవ్వనని అన్నారు. తాము సంబరాలు చేసుకుంటుంటే, అభ్యర్థి ఎవరో తెలియక వైసీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సీటు ఉంటుందో లేదో తెలియని వ్యక్తి(కొడాలి నాని) తనకు పోటీయే కాదని వెనిగండ్ల రాము తెలిపారు.

Updated Date - Feb 24 , 2024 | 06:46 PM

Advertising
Advertising