BJP: ‘వికసిత్ భారత్’ను ఫిబ్రవరి 20 వరకు నిర్వహిస్తాం: బిట్రా శివన్నారాయణ
ABN, Publish Date - Jan 29 , 2024 | 10:01 PM
‘వికసిత్ భారత్’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ(Bitra Shivannarayana) తెలిపారు.
విజయవాడ: ‘వికసిత్ భారత్’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ(Bitra Shivannarayana) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు.
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ‘పల్లెకు పోదాం’ కార్యక్రమాన్ని చేపట్టి మోదీ పథకాలను గ్రామాల్లోని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆర్థిక పరిస్ధితి బాగోగులపై స్ట్రీట్ కార్నర్‌లు రెండో విడత నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అయోధ్యలోని రామమందిరాన్ని వీక్షించేందుకు రైళ్ల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీలు నియోజకవర్గాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. రెండు రోజులు జరిగిన సమావేశాల్లో శివప్రకాష్, పురందేశ్వరి పలు సలహాలు, సూచనలు ఇచ్చారని బిట్ర శివన్నారాయణ పేర్కొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 10:03 PM