AP News: రుషికొండను నాశనం చేసి సీఎం కోసం ప్యాలెస్ కట్టారు.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ విమర్శలు
ABN, Publish Date - Feb 18 , 2024 | 12:57 PM
విశాఖపట్నంలో దేశంలోనే అత్యంత చారిత్రాక ప్రాధాన్యత కలిగిన రుషికొండను నాశనం చేసి సీఎం జగన్ కోసం ప్యాలెస్ కట్టారని జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు.
విశాఖ ఈస్ట్‌లో నిర్వహించిన శంఖారావం సభలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు కురిపించారు. విశాఖపట్నంలో దేశంలోనే అత్యంత చారిత్రాక ప్రాధాన్యత కలిగిన రుషికొండను నాశనం చేసి సీఎం జగన్ కోసం ప్యాలెస్ కట్టారని జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. విశాఖ ఈస్ట్‌లో నిర్వహించిన శంఖారావం సభలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు కురిపించారు. విశాఖలో బీచ్‌ను కాపాడాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు. సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించిన చిక్కుముడిని విప్పి సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు.
విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో ఒక గ్రామసింహం పులిలా ఫీలవుతోందని మండిపడ్డారు. 70 వేల మెజారిటీతో వెలగపూడి రామకృష్ణబాబును గెలిపించి ఆ గ్రామ సింహాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని అన్నారు. రెడ్ బుక్‌లో ఆ గ్రామసింహం పేరును ఎక్కించాల్సిందిగా కోరుతున్నానని ఆయన చెప్పారు. రక్తం దారబోసైనా సరే విశాఖ ఈస్ట్‌లో రామకృష్ణబాబును అఖండ మెజారిటీతో గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - Feb 18 , 2024 | 12:57 PM