AP News: బిజీబిజీగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కలిసేందుకు వచ్చిన హోమంత్రి అనిత
ABN, Publish Date - Jun 24 , 2024 | 08:44 PM
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. కీలక శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలువురు ముఖ్య నేతలు, ప్రముఖలు కూడా ఆయనను కలుస్తున్నారు.
విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. కీలక శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలువురు ముఖ్య నేతలు, ప్రముఖలు కూడా ఆయనను కలుస్తున్నారు. ఈ రోజు (మంగళవారం) సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు. వీటి భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత కూడా కలిశారు. ఈ భేటీ మర్యాద పూర్వకమైనదని అధికారులు చెబుతున్నారు. అయితే చీరాలలో యువతి రేప్ కేసు, రాష్ట్రంలో మహిళల అదృశ్యం ఘటనల కేసుల వివరాలను పవన్‌కు అనిత వివరించారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, మత్తు పదార్థాల రవాణా వంటి అంశాలపై దృష్టి పెట్టాలని హోం మంత్రికి ఉప ముఖ్యమంత్రి సూచించారు.
Updated Date - Jun 24 , 2024 | 08:44 PM