AP High Court : ఆ ఆడిట్ కంపెనీపై కేసు వివరాలు సమర్పించండి
ABN, Publish Date - Dec 31 , 2024 | 06:47 AM
కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాటాలను అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో పీకేఎఫ్ శ్రీధ ర్ అండ్ సంతానం...
కాకినాడ సెజ్ కేసులో సీఐడీకి హైకోర్టు ఆదేశం
కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాటాలను అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో పీకేఎఫ్ శ్రీధ ర్ అండ్ సంతానం ఎల్‌ఎల్‌పీ ఆడిట్ కంపెనీపై నమోదు చేసిన కేసు వివరాలను తమ ముందు ఉంచాలని సీఐడీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకైనా సంస్థ విషయంతో తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీఐడీని నిలువరించాలన్న పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.
Updated Date - Dec 31 , 2024 | 06:47 AM