ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Atchannaidu: వైసీపీకి అధికార మదం ఇంకా తగ్గట్లేదు

ABN, Publish Date - Mar 01 , 2024 | 04:47 PM

ఆఖరి రోజుల్లోనూ వైసీపీ కార్యకర్తల అధికార మదం తగ్గడం లేదని టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో బాణావత్ సామిని అనే గిరిజన మహిళను ట్రాక్టర్‌తో గుద్ది చంపటం దుర్మార్గమని చెప్పారు.

అమరావతి: ఆఖరి రోజుల్లోనూ వైసీపీ కార్యకర్తల అధికార మదం తగ్గడం లేదని టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో బాణావత్ సామిని అనే గిరిజన మహిళను ట్రాక్టర్‌తో గుద్ది చంపటం దుర్మార్గమని చెప్పారు. తాగడానికి గుక్కెడు నీళ్లు అడిగితే ప్రాణాలు తీశారంటే జగన్ పాలన రాతియుగం కాక మరేంటి? అని ప్రశ్నించారు. తాగే నీళ్ల దగ్గర కూడా పార్టీల పేరుతో పక్షపాతం చూపించటం దౌర్బాగ్యమన్నారు. పార్టీలు చూడం, కులం చూడం అంటూ డబ్బాలు కొట్టిన జగన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారు? అని నిలదీశారు.

నా ఎస్సీ, ఎస్టీ అంటున్న జగన్ రెడ్డికి వారిపై జరుగుతున్న మారణకాండ కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే పల్నాడులో వైసీపీ కార్యకర్తలు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు. సామిని బాయిని చంపిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 50 రోజుల్లో టీడీపీ -జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారమదంతో అరాచకం చేస్తున్న వారందరకి రాబోయే ఎన్నికల్లో బడితే పూజ ఖాయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

Andhra Pradesh: గవర్నర్ కు చంద్రబాబు లేఖ.. వారిపై చర్యలు తీసుకోవాలని వినతి..

Prathipati: చెల్లికే అన్నపై నమ్మకం లేకుంటే.. ఇక మాలాంటి వాళ్ల పరిస్థితేంటి?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2024 | 04:47 PM

Advertising
Advertising