Atchannaidu: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం జగన్ అరాచక పాలనకు పరాకాష్ట
ABN, Publish Date - Jan 06 , 2024 | 02:49 PM
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం జగన్‌రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ఠ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంగన్వాడీల సమ్మె నిషేధించడానికి రాష్ట్రమేమైనా జగన్ రెడ్డి జాగీరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
అమరావతి: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం జగన్‌రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ఠ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంగన్వాడీల సమ్మె నిషేధించడానికి రాష్ట్రమేమైనా జగన్ రెడ్డి జాగీరా అని ప్రశ్నించారు. జీవోలతో అంగన్వాడీల న్యాయపోరాటాన్ని అడ్డుకోలేరని చెప్పారు. తక్షణమే జీవో 2 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంపై అంతిమ విజయం అంగన్వాడీలదేనని చెప్పారు. అంగన్వాడీల కన్నీటిలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
కాగా.. అంగన్వాడీల సమ్మెపై (Anganwadi Strike) ఏపీ ప్రభుత్వం (AP Government) ఎస్మా ప్రయోగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై యూనియన్ నేతలు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. యూనియన్ నేతలు ఏమన్నారంటే.. ‘‘ఆరు నెలల పాటు నిరసనలు, ధర్నాలు చేయవద్దని చెప్పడానికి మీరు ఆరు నెలలు ప్రభుత్వంలో ఉండాలి కదా. మాకు ఆరునెలల సమయం.. మహా అయితే నెల రోజుల పాటు మీరు అధికారంలో ఉంటారు. మీ ఎస్మాలకు భయపడేది లేదు.. మా సమ్మె ఆగదు... అవసరమైతే లీగల్‌గానే ఎదుర్కొంటాం. ప్రభుత్వం చర్చలకి పిలవాలి.. మా వేతనాల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలుపుతాం’’ అని యూనియన్ నేతలు స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 06 , 2024 | 02:57 PM