AP Election 2024: సీఎంపై రాయి విసిరిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఏం కేసు పెట్టారంటే?
ABN, Publish Date - Apr 14 , 2024 | 02:41 PM
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై శనివారం విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. హత్యాయత్నం కింద ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా స్కూల్, టెంపుల్‌కు మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి ఈ దాడి జరిగినట్లు పోలీసుల నిర్ధారించినట్టు తెలుస్తోంది.
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై శనివారం విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. హత్యాయత్నం కింద ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా స్కూల్, టెంపుల్‌కు మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి ఈ దాడి జరిగినట్లు పోలీసుల నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఒక రాయితో దాడి జరిగినట్లు పోలీసులు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో పోలీసులు కొన్ని క్లూస్ సేకరించారు.
జగన్‌పై దాడి ఘటనపై జీవీఎల్ స్పందన
సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనను బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు ఖండించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు కూడా ఈ ఘటనను ఖండించారని అన్నారు. దాడి చేసిన వ్యక్తి ఎవరో తక్షణమే తెలుసుకొని శిక్షించాలని అన్నారు. దాడి జరిగిన 10 నిమిషాల్లోపే ప్రతిపక్షాలపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. అధికార, ప్రతిపక్ష నేతలకు ఎటువంటి భద్రత ముప్పు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు. పోలీసులు బాగా స్టడీ చేసి దాడి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అందరూ ప్రచారం చేసుకునే ప్రశాంత వాతావరణం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవద్దని రాజకీయ పార్టీలకు సూచించారు. ఏపీలో ప్రధాని మోదీ సభ నిర్వహణలో లోపం ఉందని, సెక్యూరిటీ రివ్యూ, ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో ఐటి రంగంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని జీవీఎల్ అన్నారు. ఐటీ అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉందన్నారు.
Updated Date - Apr 14 , 2024 | 02:51 PM