ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: తెలుగుదేశం – జనసేన ఉమ్మడి సభ.. ఎక్కడంటే..?

ABN, Publish Date - Feb 24 , 2024 | 06:29 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం – జనసేన( TDP – Jana Sena) కూటమి నేతలు పలు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ(YSRCP) ‘సిద్ధం’ సభలతో సీఎ జగన్ రెడ్డి(CM Jagan) ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీని ఢీకొట్టాలనే లక్ష్యంతో టీడీపీ -జనసేన పార్టీలు కూడా రణరంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం – జనసేన( TDP – Jana Sena) కూటమి నేతలు పలు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ(YSRCP) ‘సిద్ధం’ సభలతో సీఎ జగన్ రెడ్డి(CM Jagan) ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీని ఢీకొట్టాలనే లక్ష్యంతో టీడీపీ -జనసేన పార్టీలు కూడా రణరంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీనికితోడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. అయితే వీరిద్దరూ కలిసి ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించేలా మొదటి భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో బహిరంగ సభకు పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన సమన్వయ కమిటీని శనివారం నాడు ప్రకటించారు. ఈ మేరకు10మంది సభ్యులతో కమిటీని ఇరు పార్టీలు ప్రకటించాయి. తెలుగుదేశం నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ఎం.వి.సత్యనారాయణ రాజు ఉన్నారు. జనసేన నుంచి కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చాగంటి మురళీకృష్ణ, రత్నం అయ్యప్ప పేర్లను ప్రకటించారు.

Updated Date - Feb 24 , 2024 | 06:29 PM

Advertising
Advertising