ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైబర్‌ నేరాలపై అప్రమత్తం

ABN, Publish Date - Nov 23 , 2024 | 12:21 AM

సర్పవరం జంక్షన్‌, నవంబరు 22 ( ఆంధ్ర జ్యోతి): సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నేట్‌ ఆధారంగా జరిగే మోసాలను అవగాహనతో నియంత్రించవచ్చని కాకినాడ ఎస్‌డీపీవో రఘవీర్‌ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్‌ తిమ్మాపురం అక్నూ

సమావేశంలో పాల్గొన్న ఎస్‌డీపీవో

కాకినాడ ఎస్‌డీపీవో రఘవీర్‌ విష్ణు

సర్పవరం జంక్షన్‌, నవంబరు 22 ( ఆంధ్ర జ్యోతి): సైబర్‌ నేరాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నేట్‌ ఆధారంగా జరిగే మోసాలను అవగాహనతో నియంత్రించవచ్చని కాకినాడ ఎస్‌డీపీవో రఘవీర్‌ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్‌ తిమ్మాపురం అక్నూఎంఎస్‌ఎన్‌ పీజీ క్యాంపస్‌లో జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్‌ ఆధారంగా వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలకు సైబర్‌ నేరగాళ్లు పాల్పడుతున్నారన్నారు. అక్రమంగా డబ్బు సం పాదించాలనే ఉద్దేశంతో ప్రణాళిక ప్రకారం మో సాలకు పాల్పడుతున్నారన్నారు. సినిమా హాల్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి చోట్ల సర్వే పేరుతో ఈ మెయిల్‌ ఐడీ, సెల్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌ వం టివి అపరిచిత వ్యక్తులకు సమాచారం ఇవ్వవద్దన్నారు. బ్యాంకు అకౌంట్లు, పాస్‌వర్డ్‌ వంటివి సమాచారం ఎవరికి ఇవ్వవద్దన్నారు. బ్యాంకులు, పోలీసులు, అధికారులు వ్యక్తిగత సమాచారం ఫోన్లు, ఈమెయిల్స్‌ ద్వారా ఎట్టిపరిస్థితుల్లో అడ గడం జరగదన్నారు. సైబర్‌ నేరగాళ్లను పట్టుకోవడం సంక్లిష్టమైన ప్రక్రియ అన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన ద్వా రా నివారించవచ్చన్నారు. సైబర్‌ బారిన పడినవారు వెంటనే సైబర్‌ క్రైం ఇన్వెస్టిగేషన్‌ సెల్‌ 1930లో ఫిర్యాదు చేయాలని కోరారు. డిజిటల్‌ అరెస్ట్‌, స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రాడ్‌, ఎంప్లాయిమెంట్‌ ప్రాడ్‌, కేవైసీ తదిరర మోసాలపై విద్యార్థులకు పలు వీడియోలు, పోస్టర్ల ప్రదర్శించి కాకినాడ రూరల్‌ సర్కిల్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్‌ కమలాకుమారి, తిమ్మాపురం, కరప, కోరంగి, గొల్లపాలెం ఎస్‌ఐలు ఎం.రవీంద్రబాబు, సునీత, కే.సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:21 AM