Ramachandra Yadav: జగన్ పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు
ABN, Publish Date - Jan 20 , 2024 | 09:26 PM
జగన్ పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ( Ramachandra Yadav ) అన్నారు.
కర్నూలు: జగన్ పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ( Ramachandra Yadav ) అన్నారు. శనివారం నాడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ అన్నీ వ్యవస్థలను నాశనం చేశారని.. దీంతో పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్లాయన్నారు. జగన్ తల్లిని, చెల్లిని కూడా మోసం చేశారని చెప్పారు. జగన్ పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలపై పోరాటం చేస్తున్న తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోను విడుదల చేస్తామని అన్నారు. ఎన్నికల ముందు పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.
Updated Date - Jan 20 , 2024 | 10:12 PM