ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh Politics: చీపురుపల్లిలో బొత్స సెగ !

ABN, Publish Date - May 11 , 2024 | 04:59 AM

విజయనగరం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చీపురుపల్లి. ఈ నియోజకవర్గం మంత్రి బొత్స సత్యనారాయణకు పెట్టని కోట. ఈ నియోజకవర్గ పరిధిలో మూడు దశాబ్దాలుగా బొత్స రాజకీయం చేస్తున్నారు. ఆయనకు సొంత సామాజికవర్గం, బంధుత్వాలు కలసి వస్తున్నా

విజయనగరం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చీపురుపల్లి. ఈ నియోజకవర్గం మంత్రి బొత్స సత్యనారాయణకు పెట్టని కోట. ఈ నియోజకవర్గ పరిధిలో మూడు దశాబ్దాలుగా బొత్స రాజకీయం చేస్తున్నారు. ఆయనకు సొంత సామాజికవర్గం, బంధుత్వాలు కలసి వస్తున్నాయి. అయితే ఎన్నికల ముందు నియోజకవర్గంలో సమీకరణలు మారాయి. కూటమి అభ్యర్థిగా కళా వెంకట్రావు రావడంతో బొత్స అసంతృప్తి వర్గం బయటకు వచ్చేసింది.

ఏమున్నది గర్వకారణం?

మూడు దశాబ్దాలుగా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ రాజకీయం చేస్తున్నా అభివృద్ధి లేకపోగా అనుచరుల దందాలు పెరిగిపోయాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బొత్స అనుచరులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న భూ దందాలు, రియల్‌ ఎస్టేట్‌ బినామీ వ్యాపారాలు, అనుచరుల కంపెనీల్లో తయారయ్యే పైపుల ఉత్పత్తులను ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో రుద్దటం.. మంత్రిగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం.. బొత్స కోటకు బీటలువారేలా చేస్తున్నాయి. మంత్రి హోదాలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయలేకపోవడంపై రైతాంగం మండిపడుతోంది.

బొత్సకు తగ్గిన బలం!

మెరకముడిదాం మండలంలో బొత్సకు బలం తగ్గింది. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కోట్ల సన్యాసప్పలనాయుడు కుమారుల్లో ఇద్దరు టీడీపీలో చేరారు. కోట్ల మోతీలాల్‌ నాయుడు మండల స్థాయిలో ప్రజాప్రతినిధిగా వెలుగొందిన నేత. కోట్ల సుగుణాకరరావు కూడా టీడీపీలో చేరారు. బొత్సకు వెన్నుదన్నుగా ఉన్న ఈ కుటుంబంలో చీలిక ఏర్పడింది. ఇది బొత్సకు మైన్‌సగా మారింది. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ పాలనను సాగిస్తున్నారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం ఎమ్మెల్యేలు ఈయన కుటుంబానికి చెందిన వారే. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కూడా ఈయన కుటుంబానికి చెందినవారే. తాజాగా విశాఖ ఎంపీగా బొత్స సతీమణి ఝాన్సీ పోటీ చేస్తున్నారు.


కలసి వస్తున్న కళా రాజకీయం

టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావుకు కిమిడి కుటుంబం సంపూర్ణ సహకారాలు అందిస్తోంది. ఇదే సమయంలో బొత్స అసంతృప్త నాయకులు, వైసీపీ వ్యతిరేక వర్గం కళాకు జైకొట్టింది. కూటమి పార్టీల నేతల ఐక్యతతో కళా విజయంపై ధీమా వ్యక్తమవుతోంది. పార్టీకి బలమైన కేడర్‌ ఉండడం కూడా కలిసి వస్తోంది.

- విజయనగరం,ఆంధ్రజ్యోతి

మండలాలు : చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల

ఓటర్లు : పురుషులు: 1,02,627,

మహిళలు: 1,02,847,

ట్రాన్స్‌జెండర్లు: 10,

మొత్తం: 2,05,471

సామాజిక వర్గాల వారీగా..:

బీసీలు: 1,60,500:

ఓసీలు: 11,500,

ఎస్సీ:15,200,

ఇతరులు: 13,471

బొత్స బలాబలాలు

మంత్రిగా చీపురుపల్లి సహా

విజయనగరంపై గట్టి పట్టు.

కుటుంబ సభ్యుల సహకారంతోపాటు వ్యాపార వర్గాల అనుకూలత

గ్రామాల్లోనూ బొత్సకు అనుచరులు ఎక్కువగా ఉండడం

సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం

బలహీనతలు

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు.

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత.

తోటపల్లి ప్రాజెక్టు పనుల పెండింగ్‌.

షాడో నేత అధికారం చలాయింపు.

రైల్వే ఫ్లైఓవర్‌ వంతెన పనుల మందగమనం.

వెంకట్రావు బలాబలాలు

సమీప మండలం కావటం.

మాజీ మంత్రిగా, టీడీపీ

సీనియర్‌ నేతగా సుపరిచితం.

కూటమి ప్రకటించిన

సూపర్‌-6 పథకాలు.

మెరకముడిదాం మండలంలోని

కోట్ల కుటుంబం దన్ను

కమిడి నాగార్జున సహకారం.

బలహీనతలు

పొరుగు నియోజకవర్గం నుంచి రావడం.

బలమైన గళం వినిపించలేకపోవడం.

కార్యకర్తలను సమన్వయం చేయలేకపోవడం.

Updated Date - May 11 , 2024 | 04:59 AM

Advertising
Advertising