ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఆంధ్రాలో ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా.. టీడీపీ నేత స్ట్రాంగ్ కామెంట్స్

ABN, Publish Date - Feb 29 , 2024 | 08:02 PM

జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు తప్పుబట్టారు.

జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు తప్పుబట్టారు. అరెస్టు జరిగిన తీరు చూస్తుంటే సీఎం జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ‘మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం జెండా సభ సక్సెస్ కావడాన్ని తట్టుకోలేని సీఎం జగన్ ఇలా అరెస్టులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో బీటెక్ రవిని సైతం అరెస్టు చేసి, తలకు గన్ గురిపెట్టి బెదిరించారని గుర్తు ప్రస్తావించారు. చట్టానికి విరుద్ధంగా, న్యాయానికి వ్యతిరేకంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా?. నాయకులను అరెస్టు చేయడం లేదా వారి పిల్లలను అరెస్టు చేయడం జగన్‌కు పరిపాటిగా మారింది. నిజంగా అక్రమాలు జరిగినట్లు తేలితే అందుకు చట్టాలు ఉన్నాయి. వాటిని అనుసరించి చర్యలు తీసుకోవాలి. శరత్‌ను మీడియా ముందు పెట్టాలి. పోలీసులు సమాధానం చెప్పాలి. మాచవరం పోలీసులను ఇదే నా హెచ్చరిక’’ అని పిల్లి మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా.. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో మాచవరం పోలీసులు శరత్ పై కేసు నమోదు చేశారు. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురి పేర్లు చేర్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 09:24 PM

Advertising
Advertising