ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ap High Court : అందరికీ ఒకే చట్టం

ABN, Publish Date - Jun 28 , 2024 | 06:14 AM

పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు వైసీపీ ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. వైసీపీ చట్టనిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించిందని తెలిపారు.

  • వైసీపీని ప్రత్యేకంగా చూడడానికి వీల్లేదు

  • అధికారులు నిబంధనల ప్రకారమే ముందుకు

  • హైకోర్టులో వాదనలు వినిపించిన ఏజీ

  • ముగిసిన వాదనలు.. యథాతథస్థితి కొనసాగింపు

  • అనుబంధ పిటిషన్లపై తీర్పు రిజర్వ్‌

అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు వైసీపీ ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. వైసీపీ చట్టనిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించిందని తెలిపారు. సాధారణ ప్రజలకు వర్తించే చట్టమే రాజకీయ పార్టీలకూ వర్తిస్తుందని, చట్టనిబంధనలు ఉల్లంఘించి పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు రాజకీయ పార్టీలకు ప్రత్యేక వెసులుబాట్లు ఏవీ ఉండవన్నారు. రాజకీయ పార్టీ పేరుతో న్యాయస్థానం నుంచి రక్షణ పొందలేరని, కార్యాలయాల నిర్మాణాలకు అనుమతులు ఉంటే చూపాలన్నారు.

అధికారులు తుది ఉత్తర్వులు జారీ చేసిన తరువాతే న్యాయస్థానాలు రిట్‌ పిటిషన్లు అనుమతిస్తాయని, ప్రస్తుత పిటిషన్ల విషయంలో ఇదే వైఖరిని అవలంభించాలని పేర్కొన్నారు. పిటిషనర్‌ రాజకీయ పార్టీ అనే కారణంతో ప్రత్యేకంగా చూడడానికి వీల్లేదన్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాల భవనాల విషయంలో అధికారులు చట్టనిబంధనలు అనుసరిస్తారని తెలిపారు. వైసీపీ కార్యాలయాల నిర్మాణాల అంశంపై గురువారం హైకోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని అధికారులు ప్రాథమిక ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారని ఏజీ చెప్పారు. వాటికి పిటిషనర్లు వివరణలు సమర్పిస్తే అధికారులు పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు.

ఈ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పుడు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చునన్నారు. అలా కాకుండా నేరుగా కోర్టు నుంచి ఉత్తర్వులు పొందేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని, ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. భవనాలు కూల్చివేస్తే నష్టం జరుగుతుందని చెబుతూ, బాధితులుగా చిత్రీకరించుకుంటూ సానుకూల ఉత్తర్వులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును కోరారు. గురువారం జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై నిర్ణయం వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ప్రకటించారు. నిర్ణయం వెల్లడించేవరకు యథాతథస్థితి పాటించాలని ఆదేశించారు.


17 జిల్లాల అధ్యక్షుల పిటిషన్లు

అనుమతులు తీసుకోకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాలను ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారులు ఇచ్చిన ప్రొవిజనల్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ వైసీపీ బుధవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ 17 జిల్లాల వైసీపీ అధ్యక్షులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి, మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

‘భూకేటాయింపు జరిగిన తరువాత ఏడాది లోపే కార్యాలయాల నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేయాల్సి ఉంటుంది. బిల్డింగ్‌ ప్లాన్‌ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నిర్దిష్ట గడువులోగా దరఖాస్తుపై అధికారి నిర్ణయం తీసుకోకుంటే భవన నిర్మాణం చేయవచ్చని చట్టనిబంధనలు చెబుతున్నాయి. కొన్ని భవనాల విషయంలో నిర్మాణాలు కొనసాగించుకోవచ్చని అధికారులే మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపఽథ్యంలో భవన నిర్మాణాలను ప్రారంభించాం. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని కూల్చివేస్తారేమోనన్న పిటిషనర్‌ ఆందోళన సహేతుకమైనది. పిటిషనర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని కమిషనర్‌ నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని భవనాల విషయంలో యథాతథస్థితి పాటించేలా అధికారులను ఆదేశించండి’ అని వాదించారు.

Updated Date - Jun 28 , 2024 | 06:14 AM

Advertising
Advertising