AP Govt: డిసెంబర్ 7న మెగా పేరెంట్- టీచర్ మీట్
ABN, Publish Date - Dec 04 , 2024 | 09:46 PM
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ - టీచర్ మీట్ నిర్వహిస్తుంది. బాపట్ల హైస్కూల్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ పాల్గొనున్నారు.
అమరావతి, డిసెంబర్ 04: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా డిసెంబర్ 7వ తేదీన మెగా పేరెంట్- టీచర్ మీట్ నిర్వహించనున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగే కార్యక్రమంలో సీఎంచంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొనున్నారు.
Also Read: వర్రా రవీందర్ రెడ్డిని మళ్లీ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబందిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు సూచించారు. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు డిసెంబర్ 7వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించే విధంగా ఆయా పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దాలని సీఎం స్పష్టం చేశారన్నారు. ఈ తరహా కార్యక్రమం ఇప్పటికే చిన్న రాష్ట్రమైన డిల్లీలో నిర్వహించారని గుర్తు చేశారు. ఇక పెద్ద రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
Also Read: వనదేవతల ఆగ్రహమా.. మేడారంలో ఏం జరుగుతోంది..
మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రంలో వినూత్నంగా అమలు చేయనున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు. 0-5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ది అయ్యే విధంగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులతోపాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు.
Also Read: యూట్యూబ్‌లో మీకు సబ్ స్క్రైబర్లు పెరగడం లేదా? జస్ట్ ఇలా చేయండి
గరిష్టంగా 5 స్టార్ రేటింగ్‌లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌లో ఈ నెల 7వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహంచనున్నారని విపులీకరించారు.
Also Read: జాక్ పాట్ కొట్టిన రేవంత్ ప్రభుత్వం
ఈ కార్యక్రమంలో 35,84, 621 మంది విద్యార్థులు, 71,60,000 మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నార. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మాన వనరుల అభివృద్ది శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు తదితర ప్రజాప్రతినిధులు తమ సమీపంలోని పాఠశాలలో పాల్గొననున్నారని చెప్పారు.
Earthquake: మేడారం మిస్టరీ.. రంగంలోకి దిగిన అధికారులు
విద్యార్థుల సృజనాత్మతకు అనుగుణంగా తయారు చేసిన ప్రత్యేక ఆహ్వన పత్రాలతో వీరందరినీ ఆహ్వనించడం జరిగిందని తెలిపారు. మంచి ఆహ్లదకరమైన వాతావరణంలో చదువుల పండుగ తరహాలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారన్నారు. ఈ సమావేశం ప్రారంభంలో తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్.ఎం.సి. సభ్యులు, ప్రజాప్రతినిధులతో బహిరంగ సమావేశాలు జరుగనున్నాయని వెల్లడించారు.
Also Read: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన శ్రీహర్షిత
ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను చదవడంతో పాటు పాఠశాల మౌలిక వసతులు, విద్యా ఫలితాల ఆధారంగా స్టార్ రేటింగ్ వివరాలను తెలియజేయడం జరగనుందని వివరించారు. పాఠశాలల అభివృద్ది కోసం తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ఓపెన్ హౌస్ సెషన్‌ను సైతం నిర్వహిస్తామన్నారు.
Also Read: ఆ విషయం.. మా హోం మినిస్టర్ భువనేశ్వరి చూసుకుంటారు
ఇప్పటి వరకూ దాదాపు 900 పాఠశాల్లోని విద్యార్థులకు ఆరోగ్య కార్డులను రూపొందించడం జరిగిందని, వాటిని కూడా ఈ సందర్బంగా పంపిణీ చేయనున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. తల్లిదండ్రులకు సైబర్ అవగాహన పై చిన్న సెషన్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.
For AndhraPradesh News and Telugu News
Updated Date - Dec 04 , 2024 | 09:47 PM