ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP : వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడండి

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:55 AM

ప్రజలంతా ఏకమై వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ కోరారు. శ్రీనగర్‌ కాలనీలోని పార్టీ అర్బన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకే ఈశ్వరయ్యతో కలిసి శుక్రవారం జగన ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో చార్జ్‌ షీట్‌ను ఆవిష్కరించారు. సీఎం జగన మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని అన్నారు. గత ...

Jagan's corruption and irregularities charge sheet unveiled.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 26: ప్రజలంతా ఏకమై వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ కోరారు. శ్రీనగర్‌ కాలనీలోని పార్టీ అర్బన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకే ఈశ్వరయ్యతో కలిసి శుక్రవారం జగన ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో చార్జ్‌ షీట్‌ను ఆవిష్కరించారు. సీఎం జగన మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని అన్నారు. గత ఎన్నికల్లో ఒక్క చాన్స పేరుతో అబద్ధాలు, అసత్య హామీలతో అధికారం చేపట్టారని, ఆ తర్వాత అన్ని వర్గాలను నట్టేట ముంచారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.10 లక్షలు చొప్పు అప్పు మోపారని అన్నారు.


రాష్ర్టాన్ని ఇసుక, మైనింగ్‌, మద్యం మాఫియా మార్చేశారని ధ్వజమెత్తారు. రేపో మాపో మరో అబద్ధపు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు జగనరెడ్డి సిద్ధమయ్యారని అన్నారు. సొంత బాబాయ్‌ని హత్య చేసినోళ్లకు కొమ్ముకాస్తూ.. చెల్లెళ్లను రోడ్డుకు ఈడ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సైకోకు ఒక్క రోజు కూడా పాలన సాగించేందుకు వీల్లేదని అన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 27 , 2024 | 12:55 AM

Advertising
Advertising