ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ROAD SHOW: వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

ABN, Publish Date - May 02 , 2024 | 11:59 PM

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రోజురోజుకు అమిలినేని సురేంద్ర బాబుకు ఆదరణ పెరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు సాగుతున్నాయి. 250 వైసీపీ కుటుంబాలు గురువారం టీడీపీలోకి చేరారు. వీరందరికీ అమిలినేని సురేంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణదుర్గం మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన పది వైసీపీ కుటుంబాలు, మున్సిపల్‌ పరిధిలోని రాచప్పకుంట, మారెంపల్లి, ఎన్టీఆర్‌ కాలనీలకు చెందిన 60 కుటుంబాలు, చాపిరిలో 22, మున్సిపాలిటీలని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన 23 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.

శెట్టూరులో టీడీపీలోకి చేరిన వారితో అమిలినేని

50 వేల మెజార్టీతో విజయం సాధిస్తాం

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని

కళ్యాణదుర్గం, మే 2: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రోజురోజుకు అమిలినేని సురేంద్ర బాబుకు ఆదరణ పెరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు సాగుతున్నాయి. 250 వైసీపీ కుటుంబాలు గురువారం టీడీపీలోకి చేరారు. వీరందరికీ అమిలినేని సురేంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణదుర్గం మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన పది వైసీపీ కుటుంబాలు, మున్సిపల్‌ పరిధిలోని రాచప్పకుంట, మారెంపల్లి, ఎన్టీఆర్‌ కాలనీలకు చెందిన 60 కుటుంబాలు, చాపిరిలో 22, మున్సిపాలిటీలని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన 23 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. అలాగే కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన 28 వైసీపీ ముస్లిం కుటుంబాలు, మలయనూరు నుంచి 12, శెట్టూరులో వైసీపీ నాయకుడు అబ్దుల్లాతో పాటు 53 వైసీపీ కుటుంబాలు చేరారు. మున్సిపల్‌ పరిధిలో 17, 18 వార్డులకు చెందిన 23 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఒక్క చాన్స ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.


నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా పరిశ్రమలు స్థాపించి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. టీడీపీపై ప్రజల నుంచి అపూర్వ ఆదారణ లభిస్తోందన్నారు. ఏ గ్రామంలో చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 13వ తేదీన సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని విన్నవించారు. ఓటు అనే ఆయుధంతో వైసీపీ పాలనకు స్వస్తి పలికి చంద్రబాబు పాలన కోరుకోవాలని కోరారు. అప్పుడే అభివృద్ధికి బాటలు వేయడం సాధ్యమవుతుందన్నారు. టీడీపీ హయాంలోనే మహిళలకు పెద్దపీట వేశామన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబునాయుడుతోనే సాధ్యమన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పల్లె ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నారని వారందరికీ సముచిత న్యాయం జరగాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.


అమిలినేనిని గెలిపించండి: కాపు రామచంద్రారెడ్డి

కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు గెలిస్తేనే అభివృద్ధికి బాటలు వేసేందుకు అవకాశం ఉంటుందని రాయదుర్గం ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం బ్రహ్మసముద్రం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో కాపు సొంత ఊరిలో మొదటిసారిగా అమిలినేని ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. సురేంద్రబాబును గెలిపించాలని గ్రామస్థులకు విన్నవించారు.

Updated Date - May 02 , 2024 | 11:59 PM

Advertising
Advertising