CAMPAIN: టీడీపీతోనే కురుబల అభివృద్ధి
ABN, Publish Date - Apr 30 , 2024 | 11:41 PM
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కురుబ కులస్థులు అభివృద్ధి చెందారని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఉద్దేహాళ్ గ్రామంలో కురుబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు.
కూటమి అభ్యర్థి కాలవ
బొమ్మనహాళ్, ఏప్రిల్ 30: టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కురుబ కులస్థులు అభివృద్ధి చెందారని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఉద్దేహాళ్ గ్రామంలో కురుబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. ముందుగా కురుబల ఆరాధ్యదైవమైన భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల పెత్తందారుడి రూపంలో వచ్చిన వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఇనచార్జి వసుంధరాదేవి, జనసేన ఇనచార్జి మంజునాథగౌడ్, కురుబ సంఘం నాయకుడు బోరంపల్లి ఆంజనేయులు పాల్గొన్నారు.
22 కుటుంబాలు టీడీపీలో చేరిక: దర్గాహోన్నూరు, ఉద్దేహాళ్ గ్రామాల్లో వైసీపీ నుంచి 20, ఉద్దేహాళ్‌కు చెందిన రెండు కుటుంబాలు మంగళవారం కాల వ శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలోకి చేరారు. వైసీపీ ఎంపీటీసీ కోటిరెడ్డి సోదరుడు లక్ష్మీరెడ్డి, లలితల పార్టీలో చేరారు. దర్గాహోన్నూరు మాజీ సర్పంచ కేశప్ప, నవీన, లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో బలిజ తిప్పేస్వామి సోదరులు బండి వన్నూరుస్వామి, కురుబ పాల్తూరు వన్నప్ప, గంగాధర, డీ జిల్ రామాంజి, చంద్ర తది తరులు చేరారు.
గ్యార్మెంట్ రంగానికి విద్యుత రాయితీలు
రాయదుర్గం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్యార్మెంట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి అభివృద్ధికి విద్యుత రాయితీలు అందిస్తామని కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. మంగళవారం పట్టణంలోని 29వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. టెక్స్‌టైల్స్ పార్క్‌లో కేటాయించిన గార్మెంట్స్ యూనిట్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.
29 కుటుంబాలు చేరిక: పట్టణంలోని 1, 31, 32 వార్డులకు సంబంధించి 29 వైసీపీ కుటుంబాలు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరికి కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
కాలవ కుటుంబీకుల ప్రచారం: కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు కూతురు కాలవ గౌతమి మంగళవారం కణేకల్లు మండలంలోని యర్రగుంట గ్రామంలో, తనయుడు కాలవ భరత గుమ్మఘట్ట మండలంలోని బీటీపీ, కృష్ణాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీ.హీరేహాళ్ మండలంలోని గొడిశలపల్లి గ్రామంలో అల్లుడు అనిల్‌కుమార్ ఇంటింటికి ప్రచారం చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Apr 30 , 2024 | 11:43 PM