KALAVA: నన్ను గెలిపిస్తే.. మీ పాలేరులా పనిచేస్తా..
ABN, Publish Date - May 03 , 2024 | 12:02 AM
తనను గెలిపిస్తే... మీ పాలేరుగా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం బ్రహ్మసముద్రం గ్రామంలో జనసేన ఇనఛార్జ్ మంజునాథ్‌గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
కణేకల్లు, మే 2: తనను గెలిపిస్తే... మీ పాలేరుగా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం బ్రహ్మసముద్రం గ్రామంలో జనసేన ఇనఛార్జ్ మంజునాథ్‌గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ ప్రాంతంలోని రైతులు హెచ్చెల్సీ ఆయకట్టుపై ఆధారపడి జీవిస్తున్నారని, తాను మంత్రిగా ఉన్నప్పుడు సాగునీరు రావడానికి కృషి చేశానన్నారు. ఇక్కడి ప్రజలు తనకు సక్రమంగా ఓట్లు వేయలేదన్నారు. అయినా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ కోసమే ఉంటానని ఈ ఎన్నికల్లోనైనా తనకు పూర్తి మద్ధతు పలకాలని ఆయన కోరారు.
వీరశైవ లింగాయతుల అభివృద్ధికి కృషి: వీరశైవ లింగాయతుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం కణేకల్లులోని బసవేశ్వరరైస్ మిల్లులో వేలూరు మరియప్ప ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమాజానికి దారి చూపిన మహనీయుడు బసవేశ్వరుడని అటువంటి జాతిలో పుట్టిన వీరశైవలింగాయతులు ధర్మానికి నిలువెత్తు రూపమన్నారు. లింగాయతులను ఓబీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు.
బ్రహ్మసముద్రానికి చెందిన 15 వైసీపీ కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి. కాలవ శ్రీనివాసులు సమక్షంలో స్కూల్ కమిటీ మాజీ చైర్మన వెంకటేశులు, వైసీపీ వార్డు మెంబర్ వన్నూరుస్వామి, షణ్ముఖ, తిమ్మప్ప, రామకృష్ణ, శివప్పతో పాటు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
రాయదుర్గం: వైసీపీకి చెందిన హౌసింగ్ డైరెక్టర్ పాల శీనా గురువారం టీడీపీలో చేరారు. ఆయనతోపాటు నారాయణస్వామి, జకాతి కిష్టలతో పాటు మరికొందరు పార్టీలో చేరారు. బలిజలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కాలవ శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణమంటపంలో బలిజ కులస్థులతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి రావడానికి సహకారం అందించాలని కోరారు. బలిజల కళ్యాణమంటపానికి అన్ని విధాల ఆర్థికంగా చేయూతనిందిస్తానన్నారు. పట్టణంలోని 19, 22వ వార్డులలో గురువారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తనను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
కుటుంబసభ్యుల ప్రచారం: కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత గురువారం గుమ్మఘట్ట మండలంలోని బేలోడు, వైద్యం గుండ్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కుమార్తె కాలవ గౌతమి కణేకల్లు మండలంలోని పుల్లంపల్లి, గోపులాపురం గ్రామాల్లో, అల్లుడు అనిల్ డీ.హీరేహాళ్ మండలం మలపనగుడి గ్రామంలో ప్రచారం చేశారు.
Updated Date - May 03 , 2024 | 12:02 AM