ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..

ABN, First Publish Date - 2023-12-05T18:53:52+05:30

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 7వ తేదీన (గురువారం) రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 7వ తేదీన (గురువారం) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిను పేరు ఖరారు చేసినట్లు ప్రకటించారు. సీనియర్ నేతలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఎల్‌.బి.స్టేడియంలో 7వ తేదీ ఉదయం 10: 28 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యావత్‌ తెలంగాణ సమాజాన్ని ప్రమాణ స్వీకారానికి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో ఇక ప్రజాపాలన మొదలవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు

వ్యక్తిగత విషయాలు..

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన సతీమణి గీత. తండ్రి అనుముల నర్సింహారెడ్డి, తల్లి అనుముల రామచంద్రమ్మ. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్యాడ్యుయేషన్ పట్టా పొందారు. రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు.

మొదట జడ్పీటీసీ ఇండిపెండెంట్ గా గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్(బీఆర్ఎస్), బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుంచి 2007లో జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ గెలుపు పార్టీలన్ని ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేలా చేశాయి. అక్కడే ఆయన నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. తరువాత ఎమ్మెల్సీగా గెలివడంతో అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావాలని ఆహ్వానించినా.. దివంగత సీఎం ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు.

తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు రావులపల్లి గుర్నాథ్ రెడ్డి పై విజయం సాధించారు. ఆ విజయం ఆయన చరిష్మాను మరింతగా పెంచింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి బరిలో దిగిన ఆయన ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవారు. రేవంత్ 2014 – 2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. 2017 అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. 3 ఏళ్ల అనధికాలంలోనే ఎవ్వరికి దక్కని హోదాతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించింది.

Updated Date - 2023-12-05T20:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising