ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Seethakka : ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర

ABN, Publish Date - Dec 17 , 2023 | 06:35 PM

మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) ( Seethakka ) ప్రకటించారు. ఆదివారం నాడు సీతక్క మేడారం(Medaram)లో పర్యటించారు. ఈ పర్యటనలో మేడారంలో త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ములుగు: మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) ( Seethakka ) ప్రకటించారు. ఆదివారం నాడు సీతక్క మేడారం(Medaram)లో పర్యటించారు. ఈ పర్యటనలో మేడారంలో త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ....‘‘జాతర నిర్వహణకు 75కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. 75కోట్ల రూపాయలేనని కొంతమంది అడగొచ్చు... కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. జాతర సజావుగా జరిగేందుకు ప్రణాళిక చేశాం. పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తాం. శానిటేషన్, ట్రాఫిక్, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలపై దృష్టి సారించాం.కేంద్రం జాతీయ హోదా ఇవ్వడంతో నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ఆశిస్తున్నాం’’ అని మంత్రి సీతక్క తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 08:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising