ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: గ్రేటర్‌పై కేటీఆర్‌ ఫోకస్‌.. రేపటి నుంచి రోడ్‌ షోలు

ABN, First Publish Date - 2023-11-15T10:36:49+05:30

కేటీఆర్‌ గురువారం నుంచి గ్రేటర్‌లో రోడ్‌ షో చేపట్టనున్నారు. ఈనెల 20 వరకు రోడ్‌షోలు, బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు.

- ఇప్పటికే వివిధ వర్గాలతో సమావేశాలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌(KTR) గ్రేటర్‌పై ఫోకస్‌ పెట్టారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇప్పటికే రోజూ వివిధ వర్గాలతో సమావేశమవుతూ నగర అభివృద్ధికి చేసిన కార్యక్రమాలు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. నాగోల్‌లోని ఓ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ వీవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం, తెలంగాణ బిల్డర్స్‌ ఫోరం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంజారా హిల్స్‌లోని నిలోఫర్‌ కేఫ్‌లో చాయ్‌ తాగుతూ అక్కడి వారితో ముచ్చటించారు.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ గురువారం నుంచి గ్రేటర్‌లో రోడ్‌ షో చేపట్టనున్నారు. ఈనెల 20 వరకు రోడ్‌షోలు, బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు. 16న సాయంత్రం 5 గంటలకు కూకట్‌పల్లి(Kukatpally)లో, 7 గంటలకు కుత్బుల్లాపూర్‌లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. 17న సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌, 7 గంటలకు ఖైరతాబాద్‌లో పాల్గొననున్నారు. 18న సాయంత్రం 4 గంటలకు నాంపల్లిలో సమావేశం, అదే రోజు సాయంత్రం 5 గంటలకు గోషామహల్‌, 7 గంటలకు సికింద్రాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. 19న సాయంత్రం 5 గంటలకు అంబర్‌పేట్‌లో, 7 గంటలకు ముషీరాబాద్‌లో, 20న సాయంత్రం 5 గంటలకు ఉప్పల్‌లో, 7 గంటలకు ఎల్‌బీనగర్‌లో రోడ్‌ షో నిర్వహించనున్నారు.

అప్పుడేం చేశారో.. ఇప్పుడేం జరిగిందో ఆలోచించండి

నాగోల్‌లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లలో మన ప్రభుత్వం ఏం చేసింది.. గత ప్రభుత్వాలు ఏం చేశాయన్నది గుర్తు చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేయాలన్నారు. కరెంట్‌, తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించుకున్నామని, మెరుగైన మౌలిక వసతుల కల్పన కళ్ల ముందే కనిపిస్తున్నాయన్నారు. 65 యేళ్లు పాలించిన వాళ్లు ఈ స్థాయిలో పనిచేస్తే మనం ఇన్ని ఇబ్బందులు పడుదుమా ఆలోచించాలన్నారు. అన్నీ మంచిగ చేసిన కేసీఆర్‌ ఉండగా.. మీకు ఎందుకు ఓటు వేయాలని కాంగ్రెస్‌, బీజేపీ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నందుకే భూముల ధరలు పెరిగాయని, 2014కు ఎలా ఉన్న ధరలు ఎంత పెరిగాయో ఆలోచించాలన్నారు.

Updated Date - 2023-11-15T10:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising